...
...
Next Story

Lenin Release: లెనిన్ మూవీకి నో ప్రీమియర్స్.. తెల్లవారుజామునే షోలు.. నాగవంశీ ఏమన్నాడంటే?

Lenin Release: అఖిల్ అక్కినేని లీడ్ రోల్లో నటించిన లెనిన్ మూవీకి ఒక రోజు ముందు ప్రీమియర్ షోలు లేనట్లే. ప్రొడ్యూసర్ నాగవంశీ ఫస్ట్ డే ఫస్ట్ షో టైమ్ రివీల్ చేశాడు. ఇండియాలో, ఓవర్సీస్ లో దాదాపు ఒకే సమయానికి షో ప్రారంభం కానుంది.

Published on: Jul 8, 2026, 20:33:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Lenin Release: అక్కినేని అఖిల్ మోస్ట్ అవేటెడ్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి కరెక్ట్ గా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా వేదికగా పెట్టిన లేటెస్ట్ ఎక్స్ పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. జులై 10న రాబోతున్న ఈ సినిమా కోసం ఇండియా వ్యాప్తంగా ఊహించని రేంజ్ లో స్పెషల్ ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేసినట్లు ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

తెల్లవారుజాము నుంచే లెనిన్ మాస్ జాతర

Lenin Release: లెనిన్ మూవీకి నో ప్రీమియర్స్.. తెల్లవారుజామునే షోలు.. నాగవంశీ ఏమన్నాడంటే?
Lenin Release: లెనిన్ మూవీకి నో ప్రీమియర్స్.. తెల్లవారుజామునే షోలు.. నాగవంశీ ఏమన్నాడంటే?

నిర్మాత నాగవంశీ తన ట్వీట్ లో.. "లెనిన్ మీ ముందుకు రావడానికి మరో రెండు రోజుల్లో సిద్ధంగా ఉంది. అవుట్ పుట్ మొత్తం చూశాక చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. జులై 10న థియేటర్లలో ఎలాంటి మాస్ రాంపేజ్ ఉండబోతోందో మేము ఇప్పుడే ఫీల్ అవుతున్నాం" అంటూ ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.

దాంతో పాటు ఇండియావ్యాప్తంగా తెల్లవారుజామున 5:00 గంటల నుంచే స్పెషల్ షోస్ ప్రారంభం కాబోతున్నాయని, అలాగే ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఉదయం 4:30 గంటలకే పడబోతున్నాయని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని, వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు.

లెనిన్‌పై భారీ అంచనాలు

'ఏజెంట్' లాంటి డిజాస్టర్ తర్వాత అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం అఖిల్ తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశారు.

రాయలసీమ చిత్తూరు పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా రా అండ్ రస్టిక్ గా ఈ స్టోరీని డిజైన్ చేశారు. రీసెంట్ గా తిరుపతిలో జరిగిన భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ఈ సినిమాలో అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు.

భాగ్యశ్రీ గ్లామర్.. తారక్ వాయిస్ ఓవర్ బిగ్గెస్ట్ అసెట్

ఇక ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఈ మూవీకి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తారక్ బేస్ వాయిస్ తో థియేటర్లలో నెరేషన్ స్టార్ట్ అయితే రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటం ఖాయం.

డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ కథలో కురుక్షేత్రం రిఫరెన్సులను వాడుకుంటూ హై-వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.

సౌండ్ మాస్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) యాక్షన్ బ్లాక్స్ లో స్పీకర్లు బద్దలు కొట్టేలా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ షోస్ అనౌన్స్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో మెగా సెలబ్రేషన్స్ కు రెడీ అయిపోతున్నారు.

లెనిన్ మూవీ విశేషాలు

* సినిమా పేరు: లెనిన్

* నటీనటలు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే

* ప్రత్యేక ఆకర్షణ: జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

* ఇండియాలో ఫస్ట్ డే ఫస్ట్ షో: జులై 10న ఉదయం 5 గంటలకు

* ఓవర్సీస్: జులై 10న ఉదయం 4.30 గంటలకు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe