Akhil Jr NTR: థ్యాంక్యూ టైగర్.. ఎప్పటికీ మరచిపోలేనంత ప్రేమను ఇచ్చావు: జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రేమతో అఖిల్ అక్కినేని
Akhil Jr NTR: లెనిన్ మూవీకి తన వాయిస్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు అఖిల్ అక్కినేని థ్యాంక్స్ చెప్పాడు. తారక్ ను ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఫొటోలను షేర్ చేస్తూ అఖిల్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Akhil Jr NTR: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఊర మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గర్జించారు. తన పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసిన తారక్‌కు అక్కినేని అఖిల్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ థాంక్స్ చెప్పారు. "థ్యాంక్యు టైగర్.. లెనిన్ కోసం గర్జించినందుకు ధన్యవాదాలు.. ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమ ఇచ్చావు" అంటూ అఖిల్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అఖిల్‌కు ఎన్టీఆర్ బూస్ట్
'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత సరైన కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్‌కు ఎన్టీఆర్ సపోర్ట్ పెద్ద బూస్ట్ అని చెప్పాలి. నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య ఉన్న బాండింగ్ ఈ ఒక్క ట్వీట్ తో మరోసారి ప్రూవ్ అయింది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ పవర్ ఫుల్ మూవీ జులై 10న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో మహాభారతంలోని కురుక్షేత్రం రిఫరెన్సులు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు తారక్ బేస్ వాయిస్ తో నెరేషన్ ఉండటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ కానుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఎన్టీఆర్ వాయిస్ తో స్టోరీ స్టార్ట్ అయితే థియేటర్లలో రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
సీమ బ్యాక్‌డ్రాప్‌లో..
చిత్తూరు, రాయలసీమ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ లెనిన్ సినిమాలో అఖిల్ లుక్, యాటిట్యూడ్ మైండ్ బ్లోయింగ్ అని మేకర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా అఖిల్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్స్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా రా అండ్ రస్టిక్ గా డిజైన్ చేశారట. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ స్కోప్ ఉన్న సీరియస్ రోల్ లో ఆమె అదరగొట్టబోతోందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్ గా తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. "ఈ సినిమాలో అఖిల్ కనిపించడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. తన క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైపోయాడు" అని ఎమోషనల్ అయ్యారు.
రూ.100 కోట్ల మార్క్ దాటుతుందా?
సౌండ్ మాస్టర్ తమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సినిమాకు ప్రాణం పోస్తుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే నిర్మాత నాగవంశీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు కలెక్షన్స్ ఈజీగా రాబడుతుందని రీసెంట్ ఇంటర్వ్యూలో గట్టిగా చెప్పాడు.
ఏదేమైనా జులై 10న అఖిల్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో తారక్ లాంటి మాస్ హీరో వాయిస్ ఓవర్ పడటం సినిమా ఓపెనింగ్స్ కు సాలిడ్ అడ్వాంటేజ్ ఇవ్వడం ఖాయం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


