...
...
Next Story

Akkineni Akhil: నా కొడుకుతో సిసింద్రీ 2 చేస్తా.. భార్యకు కూడా చెప్పా.. మావోడు ఎప్పుడొస్తాడో: అక్కినేని అఖిల్

Akkineni Akhil: అక్కినేని అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించిన ఆల్-టైమ్ క్లాసిక్ ‘సిసింద్రీ’. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై అఖిల్ క్రేజీ కామెంట్లు వైరల్ గా మారాయి. తన కొడుకుతో ఆ ప్రాజెక్ట్ చేసే ఆలోచనను అతను బయటపెట్టాడు. భార్యకు కూడా ఈ విషయం చెప్పానన్నాడు. అఖిల్ ఇంకా ఏమన్నాడో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 25, 2026, 14:19:13 IST
Advertisement

Akkineni Akhil: తెలుగు సినీ లవర్స్ కు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు 'సిసింద్రీ' ఒక మరచిపోలేని మధుర జ్ఞాపకం. 1995లో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, అందులోని పాటలు నాటి తరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సిసింద్రీ 2 హాట్ టాపిక్ గా మారింది. అందుకు అఖిల్ కామెంట్స్ కారణం.

అఖిల్ సిసింద్రీ

నా కొడుకుతో సిసింద్రీ 2 చేస్తా.. భార్యకు కూడా చెప్పా.. మావోడు ఎప్పుడొస్తాడో: అక్కినేని అఖిల్
నా కొడుకుతో సిసింద్రీ 2 చేస్తా.. భార్యకు కూడా చెప్పా.. మావోడు ఎప్పుడొస్తాడో: అక్కినేని అఖిల్

సిసింద్రీ సినిమాలో ఏడాది వయసున్న పసిపాపగా కెమెరా ముందుకు వచ్చి తన అమాయకత్వంతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లీడ్ రోల్‌లో అలరించాడు అఖిల్ అక్కినేని, ప్రస్తుతం హీరోగా ఈ అక్కినేని వారసుడు టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా క్లాసిక్ మూవీ సిసింద్రీ సీక్వెల్‌పై అఖిల్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

నా కొడుకుతోనే ఆ సినిమా చేస్తా

తన కెరీర్‌లోనే కాకుండా అక్కినేని కాంపౌండ్‌లో మైలురాయిగా నిలిచిన 'సిసింద్రీ' సినిమా గురించి మాట్లాడిన అఖిల్ ఒక క్రేజీ ఐడియాను బయటపెట్టాడు. "నాకు కొడుకు పుడితే 'సిసింద్రీ 2' సినిమా చేయాలని ఉంది. ఈ విషయాన్ని నా భార్యకు కూడా చెప్పా. మావోడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చేస్తామో చూడాలి" అని అఖిల్ ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించాడు.

వైరల్ గా వీడియో

హాలీవుడ్ కల్ట్ కామెడీ మూవీ 'బేబీస్ డే అవుట్' (Baby's Day Out) ఆధారంగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'సిసింద్రీ'లో నాగార్జున కూడా కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించాడు కూడా. ఆ రోజుల్లో కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా సంచలనం సృష్టించింది.

ఇప్పుడు అఖిల్ స్వయంగా ఈ కాన్సెప్ట్‌ను తన తదుపరి తరానికి విస్తరించాలని అనుకోవడం అక్కినేని బ్రాండ్ వాల్యూకు మరింత ప్లస్ కానుంది.

అప్పుడు నాగార్జున

టాలీవుడ్ చరిత్రను పరిశీలిస్తే అక్కినేని నాగేశ్వరరావు (ANR) నుంచి నాగార్జున 'సుడిగుండాలు' ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం కాగా, నాగార్జున నుంచి అఖిల్ 'సిసింద్రీ' ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్ ప్రతిపాదించిన 'సిసింద్రీ 2' ఆలోచన నోస్టాల్జియా ఫీల్ ఇస్తోందిన అంటున్నారు.

తాజాగా లెనిన్ మూవీ సూపర్ హిట్ కావడంతో అఖిల్ తన కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks