Akhil Jr NTR: రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఊర మాస్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin) కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గర్జించారు. తన పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో సినిమా రేంజ్‌ను అమాంతం పెంచేసిన తారక్‌కు అక్కినేని అఖిల్ ఎక్స్ వేదికగా ఎమోషనల్ థాంక్స్ చెప్పారు. "థ్యాంక్యు టైగర్.. లెనిన్ కోసం గర్జించినందుకు ధన్యవాదాలు.. ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమ ఇచ్చావు" అంటూ అఖిల్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అఖిల్‌కు ఎన్టీఆర్ బూస్ట్

'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత సరైన కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని అఖిల్‌కు ఎన్టీఆర్ సపోర్ట్ పెద్ద బూస్ట్ అని చెప్పాలి. నందమూరి, అక్కినేని ఫ్యామిలీల మధ్య ఉన్న బాండింగ్ ఈ ఒక్క ట్వీట్ తో మరోసారి ప్రూవ్ అయింది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ పవర్ ఫుల్ మూవీ జులై 10న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.
రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో మహాభారతంలోని కురుక్షేత్రం రిఫరెన్సులు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. ఇప్పుడు తారక్ బేస్ వాయిస్ తో నెరేషన్ ఉండటం ఈ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్ కానుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఎన్టీఆర్ వాయిస్ తో స్టోరీ స్టార్ట్ అయితే థియేటర్లలో రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
సీమ బ్యాక్‌డ్రాప్‌లో..
చిత్తూరు, రాయలసీమ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ లెనిన్ సినిమాలో అఖిల్ లుక్, యాటిట్యూడ్ మైండ్ బ్లోయింగ్ అని మేకర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా అఖిల్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్స్ మునుపెన్నడూ చూడని విధంగా చాలా రా అండ్ రస్టిక్ గా డిజైన్ చేశారట. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. తన గ్లామర్ తో పాటు యాక్టింగ్ స్కోప్ ఉన్న సీరియస్ రోల్ లో ఆమె అదరగొట్టబోతోందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్ గా తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. "ఈ సినిమాలో అఖిల్ కనిపించడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. తన క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైపోయాడు" అని ఎమోషనల్ అయ్యారు.
రూ.100 కోట్ల మార్క్ దాటుతుందా?
{{/usCountry}}సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్స్ పై నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రీసెంట్ గా తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ.. "ఈ సినిమాలో అఖిల్ కనిపించడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. తన క్యారెక్టర్ లో పూర్తిగా లీనమైపోయాడు" అని ఎమోషనల్ అయ్యారు.
రూ.100 కోట్ల మార్క్ దాటుతుందా?
{{/usCountry}}సౌండ్ మాస్టర్ తమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సినిమాకు ప్రాణం పోస్తుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే నిర్మాత నాగవంశీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు కలెక్షన్స్ ఈజీగా రాబడుతుందని రీసెంట్ ఇంటర్వ్యూలో గట్టిగా చెప్పాడు.
ఏదేమైనా జులై 10న అఖిల్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో తారక్ లాంటి మాస్ హీరో వాయిస్ ఓవర్ పడటం సినిమా ఓపెనింగ్స్ కు సాలిడ్ అడ్వాంటేజ్ ఇవ్వడం ఖాయం.