...
...
Next Story

Nagarjuna Biker Review: బైకర్ మూవీని అందుకే చూడాలి.. కింగ్ నాగార్జున రివ్యూ.. తమ కాలేజీ స్టూడెంట్ పట్ల గర్వంగా ఉందంటూ!

Nagarjuna Biker Review: బైకర్ సినిమాపై కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించేశాడు. ఈ మూవీని తప్పకుండా చూడాలని రివ్యూ ఇచ్చేశాడు. అలాగే అన్నపూర్ణ కాలేజీ స్టూడెంట్ అయిన ఈ సినిమా డైరెక్టర్ పట్ల గర్వంగా ఉందని అక్కినేని నాగార్జున పేర్కొన్నాడు.

Published on: Apr 4, 2026, 14:21:38 IST
Advertisement

యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ‘బైకర్’. బైక్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 3) థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రేసింగ్ సీక్వెన్స్ తో పాటు తండ్రీ కొడుకుల ఎమోషన్ ను బాగా చూపించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బైకర్ మూవీపై కింగ్ నాగార్జున రివ్యూ ఇచ్చేశాడు.

నాగార్జున రివ్యూ

నాగార్జున బైకర్ రివ్యూ (x/iamnagarjuna)
నాగార్జున బైకర్ రివ్యూ (x/iamnagarjuna)

శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్’ మూవీపై అక్కినేని నాగార్జున ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ ఎక్స్ లో తన రివ్యూ పోస్టు చేశాడు. ఈ బైకర్ ఫిల్మ్ ను ఎందుకు చూడాలో చెప్పేశాడు.

చూడాల్సిందే

‘‘ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్ షిప్స్ ను సెలబ్రేట్ చేసే సినిమా బైకర్. ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్, క్లైమాక్స్ కోసం ఈ మూవీని చూడాల్సిందే. టెక్నికల్ పరంగా మూవీ అదిరిపోయింది. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి పట్ల ఎంతో గర్వంగా ఉంది.

అతను అన్నపూర్ణ కాలేజీ ఆప్ ఫిల్మ్ అండ్ మీడియా స్టూడెంట్. ఇలాంటి సబ్జెక్ట్ ను ఎంతో మెచ్యూరిటీతో డీల్ చేశాడు. బైకర్ టీమ్ కు అభినందనలు’’ అని నాగార్జున పోస్టు పెట్టాడు.

బైకర్ గురించి

వికాస్ నారాయణన్ అలియాస్ విక్కీ (శర్వానంద్) ఇండియాలోనే టాప్ రేసర్. తండ్రి సునీల్ నారాయణన్ (రాజశేఖర్) శిక్షణలో విక్కీ రేసింగ్ పై పట్టు సాధిస్తాడు. ఒకప్పుడు రేసింగ్ లో అదరగొట్టిన సునీల్ నారాయణన్ తన కొడుకును ప్రపంచ ఛాంపియన్ గా చూడాలనుకుంటాడు.

ఇండియాలో క్రికెట్ లాగే రేసింగ్ కు కూడా క్రేజ్ రావాలని సునీల్ కోరుకుంటాడు. తండ్రి దగ్గర ట్రైనింగ్ పొందిన విక్కీ రేస్ ట్రాక్ పై బైక్ ను పరుగులు పెట్టిస్తాడు. కానీ సడెన్ గా రేసింగ్ ను వదిలేసి వెళ్లిపోతాడు. సునీల్ కు అవమానం ఎదురవుతుంది.

కట్ చేస్తే తన భార్య అనన్య (మాళవిక నాయర్), ఓ కొడుకుతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు విక్కీ. ఓ గో కార్టింగ్ రేస్ ట్రాక్ నడుపుతుంటాడు. అయితే తన తండ్రికి జరిగిన అవమానం గురించి తెలిసి విక్కీ మళ్లీ రేసింగ్ స్టార్ట్ చేస్తాడు. అసలు విక్కీ రేసింగ్ ను ఎందుకు వదిలేశాడు? మళ్లీ ఎందుకు స్టార్ట్ చేశాడు? ఇందులో అనన్యతో లవ్ స్టోరీ ఏంటీ? అన్నది తెలియాలంటే ‘బైకర్’ మూవీ చూడాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks