Altaf Hassan Rajigadu Rajayyadu Teaser Launch: "బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హాసన్. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా "రాజిగాడు రాజయ్యాడు".
రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంచ్

ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్‌పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" మూవీలో అను శ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు రాజిగాడు రాజయ్యాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
మంచి కాన్సెప్టుతో వస్తున్న సినిమా
ఈ కార్యక్రమంలో నటుడు కేశవ మాట్లాడుతూ.. "మంచి కాన్సెప్ట్, స్టోరీతో వస్తున్న చిత్రమిది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను మీరు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా" అని అన్నారు.
ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది
నటుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా టైటిల్‌లోనే ఒక రిథమ్ ఉంది. ఈ టైటిల్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని నమ్ముతున్నాను. నేను ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ అల్తాఫ్ గారికి థ్యాంక్స్" అని చెప్పారు.
టి కృష్ణ సినిమాలు ఎలా ఉండేవో
నటుడు శివకుమార్ కాముని మాట్లాడుతూ.. "అప్పట్లో టి కృష్ణ గారి సినిమాలు ఎలా ఉండేవో అలా సామాజిక చైతన్యాన్ని కలిగించే చిత్రమిది. ఈ సినిమాలో నేను విలన్ బావమరిది క్యారెక్టర్లో నటిస్తున్నాను. మీ ఆదదరణ కోరుతూ త్వరలోనే మా మూవీ ముందుకు రాబోతోంది" అని వెల్లడించారు.
మాలాంటి రంగస్థల నటులతో
{{/usCountry}}నటుడు శివకుమార్ కాముని మాట్లాడుతూ.. "అప్పట్లో టి కృష్ణ గారి సినిమాలు ఎలా ఉండేవో అలా సామాజిక చైతన్యాన్ని కలిగించే చిత్రమిది. ఈ సినిమాలో నేను విలన్ బావమరిది క్యారెక్టర్లో నటిస్తున్నాను. మీ ఆదదరణ కోరుతూ త్వరలోనే మా మూవీ ముందుకు రాబోతోంది" అని వెల్లడించారు.
మాలాంటి రంగస్థల నటులతో
{{/usCountry}}నటుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "ఫేమస్ అయిన ఆర్టిస్టులతోనే సినిమాలు చేయాలని మేకర్స్ కోరుకుంటారు. కానీ మాలాంటి రంగస్థల నటులతో సినిమా చేసినందుకు మా డైరెక్టర్, హీరో అల్తాఫ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా" అని చెప్పుకొచ్చారు.
కళకు అలాంటి బేధం లేదు
గీత రచయిత, నటుడు డా.గోరటి వెంకన్న మాట్లాడుతూ.. "చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధాలు కొందరు సృష్టించినవి. కానీ కళ అయిన సినిమాకు అలాంటి బేధం లేదు. ఇతర భాషల చిత్రాలు ఆ బేధాలు చెరిపేస్తున్నాయి. తెలుగులో కూడా ఆ మార్పు వస్తుంది" అని అన్నారు.
ఆయన నాటకానికి నంది అవార్డ్స్ వచ్చాయి
"ఈ చిత్ర కథా రచయిత ఎన్నో గొప్ప అవార్డ్స్ పొందిన వారు. ఆయన నాటకం కూడా నంది పురస్కారాలు పొందింది. అలాంటి గొప్ప కథను ఈ సినిమాకు ఎంచుకున్నారు అల్తాఫ్. నేను ఈ సినిమాను మూడు సార్లు చూశా ఎప్పుడూ బోర్ రాలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి" అని గోరటి వెంకన్న తెలిపారు.
ఒక జీవితాన్ని చూసిన ఫీల్
"మూస చిత్రాలకు భిన్నంగా అల్తాఫ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ సినిమాలో నేనొక మంచి క్యారెక్టర్ కూడా చేశాను. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రావడం లేదు. ఒక జీవితాన్ని చూసిన ఫీల్ కలిగిస్తుంది. ఏ ప్రాంతం నేపథ్యంతో వస్తున్న కథైనా మనకు హార్ట్ టచింగ్‌గా ఉండాలి. మనసును తాకే ఆ తరహా కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి" అని గోరటి వెంకన్న కోరారు.