Alpha Trailer: లంకను తగలబెట్టడానికి సీతే వచ్చింది.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్‌తో ఆల్ఫా ట్రైలర్.. హృతిక్ ఎంట్రీ అదుర్స్
Alpha Trailer: యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha) అఫీషియల్ ట్రైలర్ బుధవారం (జూన్ 17) విడుదలైంది. అలియా భట్ హై-వోల్టేజ్ యాక్షన్ స్టంట్స్, బాబీ డియోల్ విలనిజం, చివర్లో హృతిక్ రోషన్ సర్‌ప్రైజ్ ఎంట్రీతో ఈ ట్రైలర్ సంచలనం రేపుతోంది.
Alpha Trailer: ఈసారి లంకను తగలబెట్టడానికి హనుమంతుడు కాదు.. నేరుగా సీతనే వచ్చింది. బాలీవుడ్ నటి అలియా భట్ లీడ్ రోల్లో నటిస్తున్న ఆల్ఫా మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇందులో సీత అనే ఓ పవర్‌ఫుల్ పాత్రలో అలియా నటిస్తోంది. ఆమె భీభత్సమైన యాక్షన్ అవతారం, చివర్లో హృతిక్ రోషన్ స్పెషల్ ఎంట్రీ ఉన్న ఈ ట్రైలర్.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) రేంజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంది.

Sita Destroys Lanka | లంకను కాల్చే సీత
ఆల్ఫా మూవీ ట్రైలర్ ప్రారంభంలో ఒక గాజు గదిలో ఉన్న చిన్న పాపను చూపిస్తూ.. ఆమెకు 'సీత' అని పేరు పెట్టినట్లు విలన్ ఫతే (బాబీ డియోల్) చెబుతాడు. ఆ చిన్నారిని ఒక క్రూరమైన కిల్లింగ్ మెషిన్ లా, ఆర్డర్ ఇస్తే క్షణాల్లో టార్గెట్ ను ఖతం చేసే పవర్‌ఫుల్ హంతకురాలుగా ఫతే ట్రైనింగ్ ఇస్తాడు.
కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. తనను పెంచిన ఫతే ఒక రాక్షసుడని, ఒక యువరాణిని అపహరించిన లంకేశ్వరుడని అలియా భట్ వాయిస్ ఓవర్ లో చెప్తుంది. రామాయణంలోని సీతలా రాముడు వచ్చి కాపాడే వరకు ఈ సీత ఎదురుచూడదు.. తను నేర్చుకున్న విద్యలతోనే ఫతే సామ్రాజ్యమైన లంకను దహనం చేయడానికి ఒంటరి పోరాటం మొదలుపెడుతుంది. ఈ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లో అలియా భట్ రౌద్ర రూపం థ్రిల్ కలిగిస్తుంది.
Sharvari, Anil Kapoor Mission | మిషన్ లోకి శర్వరీ.. గైడ్ గా అనిల్ కపూర్
ఈ పవర్‌ఫుల్ మిషన్ లో అలియా భట్ కు తోడుగా శర్వరీ జాయిన్ అవుతుంది. వీరిద్దరినీ ఒక పక్కా ప్లాన్ తో గైడ్ చేసే ఏజెంట్ గా సీనియర్ స్టార్ అనిల్ కపూర్ (Anil Kapoor) కనిపిస్తున్నారు. దేశం కోసం పనిచేసి మోసపోయిన మాజీ స్పై ఫతే.. "ఒకప్పుడు ఇండియా ఆల్ఫా విలువ తెలుసుకోలేదు, ఇప్పుడు అదే ఇండియా ఆల్ఫా పేరు వింటే వణికిపోతుంది" అంటూ దేశంపై పగ తీర్చుకోవడానికి రెడీ అవుతాడు. అతన్ని అడ్డుకోవడానికి అతని చేతిలోనే పెరిగిన 'సీత' ఎలాంటి వ్యూహాలు వేసిందనేదే సినిమా అసలు కథ.
హృతిక్ రోషన్ బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్
ఆల్ఫా మూవీ ట్రైలర్ చివర్లో ఫ్యాన్స్ కు మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. 'వార్', 'వార్ 2' చిత్రాల కల్ట్ క్యారెక్టర్ మేజర్ కబీర్ ధలివాల్ (హృతిక్ రోషన్) ఈ మిషన్ లో అలియా, శర్వరీలకు హెల్ప్ చేయడానికి ఎంట్రీ ఇస్తాడు. ట్రైలర్ లో కేవలం హృతిక్ రోషన్ కళ్లు మాత్రమే చూపించినా.. స్పై యూనివర్స్ ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ లేపడానికి ఆ ఒక్క షాట్ చాలు అనిపిస్తోంది.
ఈ ట్రైలర్ రిలీజ్ కు ముందే అలియా భట్ సోషల్ మీడియాలో శర్వరీతో కలిసి ఉన్న ఫన్నీ ఫోటోలను షేర్ చేస్తూ.. టీజర్ విమర్శలకు చాలా స్మార్ట్ గా కౌంటర్ ఇచ్చింది. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3', 'వార్ 2' సినిమాల తర్వాత వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ఇదే. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
హెచ్‌టీ విశ్లేషణ
ప్రస్తుతం బాలీవుడ్ లో ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ సినిమాలకు ఒక కొత్త వేవ్ నడుస్తోంది. 'ది రైల్వే మెన్' వెబ్ సిరీస్ తో మెప్పించిన డైరెక్టర్ శివ్ రవైల్.. ఈ సినిమాలో అలియా, శర్వరీలను ప్రెజెంట్ చేసిన తీరు హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంది. బాబీ డియోల్ మార్క్ విలనిజం 'యానిమల్' తర్వాత ఇందులో మరింత పవర్‌ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. వీటన్నింటికీ మించి హృతిక్ రోషన్ 'కబీర్' క్యారెక్టర్ కనెక్టివిటీ ఉండటం వల్ల సౌత్ లో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


