Ramba Oorvasi Menaka Censor: కమెడియన్ అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన తాజా సోషియో-ఫాంటసీ కామిడీ చిత్రం 'రంభ ఊర్వశి మేనక' (Ramba Oorvasi Menaka). ఈ మూవీ విడుదలపై హఠాత్తుగా మబ్బులు కమ్ముకున్నాయి. 2026 సెప్టెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే, సరిగ్గా విడుదల తేదీ దగ్గరపడుతున్న సమయంలో ఈ రంభ ఊర్వశి మేనక చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ఊహించని షాక్ తగిలినట్లు తెలిసింది.
సెన్సార్ బోర్డు షాక్
రంభ ఊర్వశి మేనక సినిమాకు సెన్సార్ బోర్డు భారీ షాక్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. సినిమాలో దేవలోకం నుంచి భూమిపైకి వచ్చే అప్సరసలు రంభ, ఊర్వశి, మేనకల గ్లామరస్ దుస్తులపై సెన్సార్ బోర్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్. ఆ సన్నివేశాల్లో వారి దుస్తులు మితిమీరిన రీతిలో అసభ్యకరంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు ఫీల్ అయిందని సమాచారం.
రిలీజ్ కష్టమేనా?
రంభ, ఊర్వశి, మేనక గ్లామర్ దుస్తుల ప్లేస్ లో మరింత సంప్రదాయబద్ధమైన చీరకట్టులో ఆ పాత్రలను చూపించాలని బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. సెన్సార్ పర్మిషన్ లభించాలంటే ఆయా సన్నివేశాల్లో మార్పులు చేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 4న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దేవలోకం నుంచి భూమికి అప్సరసలు!
చంద్ర మోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందిన ఈ రంభ ఊర్వశి మేనక చిత్రం ఒక విచిత్రమైన సోషియో-ఫాంటసీ కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఒక సాధారణ యువకుడు ఒక మాయా పుస్తకం సహాయంతో స్వర్గలోకంలోని దేవకన్యలు రంభ, ఊర్వశి, మేనకలను భూమి మీదికి రప్పించడానికి దాదాపు 15 సంవత్సరాల పాటు నిరంతరం ప్రయత్నాలు చేస్తాడు.
{{/usCountry}}చంద్ర మోహన్ చింతడ దర్శకత్వంలో రూపొందిన ఈ రంభ ఊర్వశి మేనక చిత్రం ఒక విచిత్రమైన సోషియో-ఫాంటసీ కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఒక సాధారణ యువకుడు ఒక మాయా పుస్తకం సహాయంతో స్వర్గలోకంలోని దేవకన్యలు రంభ, ఊర్వశి, మేనకలను భూమి మీదికి రప్పించడానికి దాదాపు 15 సంవత్సరాల పాటు నిరంతరం ప్రయత్నాలు చేస్తాడు.
{{/usCountry}}ఈ క్రమంలో వారి రాకను అడ్డుకోవడానికి దేవేంద్రుడు చేసే ప్రయత్నాలు, చివరికి ఆ దేవకన్యలు భూమిపైకి అడుగుపెట్టిన తర్వాత చోటుచేసుకునే వినోదాత్మక పరిణామాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చిత్రబృందం చెబుతోంది. ఈ సినిమాలో ఊర్వశిగా విష్ణుప్రియ, రంభగా రాశీ సింగ్, మేనకగా ప్రియా సింగ్ నటించారు.
సినిమాలో ఇలా
'దసరా', 'సామజవరగమన' వంటి హిట్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, ప్రసాద్ నిమ్మకాయల సంయుక్తంగా ఈ రంభ ఊర్వశి మేనక చిత్రాన్ని నిర్మించారు. అల్లరి నరేష్ సరసన సురభి పురాణిక్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్ కీ రోల్ ప్లే చేశాడు. సెన్సార్ బోర్డు సూచించిన మార్పుల కారణంగా విడుదల తేదీపై నిర్మాతలు త్వరలోనే ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.