...
...
Next Story

Allu Aravind Pan India: పాన్ ఇండియా సినిమాలపై మొహం మొత్తేసిందా.. బన్నీకి ఈ విషయం చెప్పారా: అల్లు అరవింద్ ఏమన్నారంటే?

Allu Aravind Pan India: భారీ బడ్జెట్ పాన్-ఇండియా కమర్షియల్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో బోర్ మొదలైందన్న విషయాన్ని తాను రెండేళ్ల ముందే ఊహించానని అల్లు అరవింద్ పేర్కొన్నారు. అయితే ఇదే విషయాన్ని తన కుమారుడు అల్లు అర్జున్‌కు చెప్పారా అని విలేకరులు ప్రశ్నించగా.. నవ్వుతూ "నిజంగా చెప్పలేదు" అని చమత్కరించారు.

Published on: Nov 27, 2026, 10:57:12 IST
Advertisement

Allu Aravind Pan India: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తన సుదీర్ఘ సినీ అనుభవంతో ఎప్పుడూ ట్రెండ్‌కు తగ్గట్టుగా సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. తాజాగా ఆయన సమర్పణలో, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తొలిరోజు కాస్త నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Allu Aravind Pan India: పాన్ ఇండియా సినిమాలపై మొహం మొత్తేసిందా.. బన్నీకి ఈ విషయం చెప్పారా: అల్లు అరవింద్ ఏమన్నారంటే?
Allu Aravind Pan India: పాన్ ఇండియా సినిమాలపై మొహం మొత్తేసిందా.. బన్నీకి ఈ విషయం చెప్పారా: అల్లు అరవింద్ ఏమన్నారంటే?

ఈ సందర్భంగా గురువారం (నవంబర్ 26) హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ కమర్షియల్ సినిమాలు, పాన్-ఇండియా ట్రెండ్, తన కుమారుడు అల్లు అర్జున్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పాన్-ఇండియా సినిమాలపై ప్రేక్షకులకు బోర్.. అల్లు అర్జున్‌కు చెప్పారా?

ప్రెస్ మీట్‌లో ఓ విలేకరి అల్లు అరవింద్‌ను ఉద్దేశిస్తూ.. “ప్రస్తుతం తెలుగు అగ్ర హీరోలందరూ భారీ బడ్జెట్, హై-ఓల్టేజ్ యాక్షన్‌తో కూడిన పాన్-ఇండియా సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. కానీ గత ఏడాదిన్నరగా అలాంటి రొటీన్ కమర్షియల్ అంశాలపై ప్రేక్షకులకు మొహం మొత్తేసింది. జనం ఇప్పుడు క్లాసీగా, ఆహ్లాదకరంగా ఉండే సినిమాలు కోరుకుంటున్నారు. అలాంటి సినిమాలు చేయడానికి టాలీవుడ్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ వంటి పరభాషా నటుల వైపు చూడాల్సి వస్తోంది” అని ప్రశ్నించారు.

దీనికి అల్లు అరవింద్ చిరునవ్వుతో సమాధానమిస్తూ.. “ఏ మంచి వ్యాపారవేత్త అయినా రాబోయే రెండు మూడేళ్ల తర్వాత మార్కెట్‌లో ఏం జరుగుతుందో ముందే ఊహించగలడు. రెండేళ్ల క్రితమే నేను ఈ పరిస్థితిని ఊహించానని నా సమాధానాన్ని అర్థం చేసుకోండి” అన్నారు.

అయితే తాను కమర్షియల్ సినిమాలకు వ్యతిరేకం కాదని అల్లు అరవింద్ వెంటనే స్పష్టత ఇచ్చారు.

“నేను సాధారణంగా అందరికీ చెప్పే మాటే చెప్పాను. అంతే తప్ప కమర్షియల్ సినిమాలకు ఆదరణ తగ్గిపోతుందని రెండేళ్ల ముందే చెప్పానని దీని అర్థం కాదు. నేను కూడా ఎప్పుడూ మంచి కమర్షియల్ సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తాను” అని అన్నారు.

“నా భవిష్యత్ సినిమాలు మీరు చెప్పినట్లుగా ఉంటాయో లేదో తెలియదు కానీ 2027, 2028 సంవత్సరాల్లో భారీ స్టార్ కాస్ట్‌తో కూడిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను నేను నిర్మించబోతున్నాను” అని అల్లు అరవింద్ ప్రకటించారు.

అల్లు అర్జున్, అల్లు అరవింద్ క్రేజీ లైనప్

2018లో 'నా పేరు సూర్య' నిరాశపరిచిన తర్వాత, 2020లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో'తో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప: ది రైజ్' (2021), 'పుష్ప 2: ది రూల్' (2024) చిత్రాలు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచి బన్నీని గ్లోబల్ స్టార్‌గా మార్చాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో, దీపికా పదుకొణె కథానాయికగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'రాకా' (Raaka)లో నటిస్తున్నారు. దీనితో పాటు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా బన్నీ లైనప్‌లో ఉంది. మరోవైపు నిర్మాత అల్లు అరవింద్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో దిగ్గజ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ 'ఎం.ఎస్ - ఎ లెగసీ ఆన్ స్క్రీన్' (MS - A Legacy on Screen) చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Featured Video

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks