Allu Aravind Allu Cinemas: అల్లు సినిమాస్ థియేటర్ బయట ఆడియెన్స్ ఆవేదన.. తక్షణమే వీడియో కాల్‌తో అల్లు అరవింద్ యాక్షన్

Allu Aravind Reacts To Allu Cinemas Ticket Blocking Issue: అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్‌లో టికెట్లను బ్లాక్ చేస్తున్నారంటూ ప్రేక్షకులు అల్లు అరవింద్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. ఆ స్పాట్‌లోనే వీడియో కాల్‌తో అల్లు అరవింద్ యాక్షన్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతోంది.

Published on: Nov 21, 2026, 05:31:06 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Allu Aravind Reacts To Allu Cinemas Ticket Blocking Issue: హైదరాబాద్ సినీ ప్రియులకు 'అల్లు సినిమాస్' (Allu Cinemas) అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అత్యాధునిక డాల్బీ సౌండ్, విశాలమైన స్క్రీన్‌లతో ఈ మల్టీప్లెక్స్ నగరవాసులను బాగా ఆకట్టుకుంటోంది.

అల్లు సినిమాస్ థియేటర్ బయట ఆడియెన్స్ ఆవేదన.. తక్షణమే వీడియో కాల్‌తో అల్లు అరవింద్ యాక్షన్
అల్లు సినిమాస్ థియేటర్ బయట ఆడియెన్స్ ఆవేదన.. తక్షణమే వీడియో కాల్‌తో అల్లు అరవింద్ యాక్షన్

ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకట్లేదని

అయితే, పెద్ద సినిమాలు విడుదలైన ప్రతిసారీ ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకడం లేదని, థియేటర్ యాజమాన్యం కావాలనే టికెట్లను బ్లాక్ చేస్తోందని కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా స్వయంగా థియేటర్‌కు వచ్చిన అగ్రనిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్‌కు ప్రేక్షకుల నుంచి ఇదే తరహా ఫిర్యాదు ఎదురైంది.

థియేటర్ నుంచి బయటకు వస్తున్న అల్లు అరవింద్‌ను కొందరు ప్రేక్షకులు ఆపి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. డాల్బీ స్క్రీన్ టికెట్లు బుకింగ్ యాప్స్‌లో అసలు కనిపించడం లేదని ఒక యువకుడు నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లాడు.

సమస్య చెప్పుకున్న ఆడియెన్స్

అసలు ఏం జరుగుతోందని అల్లు అరవింద్ ఆరా తీయగా, భారీ చిత్రాల విడుదల సమయంలో షో మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు వరకు టికెట్లను బ్లాక్ చేసి ఉంచుతున్నారని అక్కడున్న వారు వివరించారు. కింది నాలుగు వరుసలు తప్ప మిగతా సీట్లన్నీ బ్లాక్‌లో పెడుతున్నారని, తీరా షో సమయానికి అవి అమ్ముడుపోకపోతే అప్పుడు ఆన్‌లైన్‌లో వదులుతున్నారని వారు వాపోయారు.

స్పాట్‌లోనే వీడియో కాల్.. సిబ్బందికి ఆదేశాలు

ప్రేక్షకుల మాటలు విన్న అల్లు అరవింద్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. "ఒక్క నిమిషం ఆగండి.. ఇప్పుడే నా సిబ్బందికి ఫోన్ చేస్తాను" అని అరవింద్ అన్నారు. వెంటనే తన జేబులోంచి ఫోన్ తీసి మేనేజ్‌మెంట్ బృందానికి వీడియో కాల్ కలిపారు.

కెమెరాను అక్కడున్న ప్రేక్షకుల వైపు తిప్పి, సమస్య ఏంటో నేరుగా వారికే వివరించాలని అల్లు అరవింద్ కోరారు. మొదట కాస్త సంకోచించిన అభిమానులను చూసి, "పర్వాలేదు, అసలు సమస్య ఏంటో చెప్పండి" అని అరవింద్ ప్రోత్సహించారు. దీంతో ప్రేక్షకులు తమ ఇబ్బందిని స్పష్టంగా వివరించారు.

రెండు వరుసలు మాత్రమే ఉంచి

అభిమానుల ఆవేదనను అర్థం చేసుకున్న అరవింద్ అక్కడికక్కడే కీలక హామీ ఇచ్చారు. "ఈ వ్యవహారాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. కేవలం రెండు వరుసలు మాత్రమే ఉంచి, మిగతా టికెట్లన్నింటినీ సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశిస్తాను" అని అరవింద్ స్పష్టం చేశారు.

ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక నెటిజన్ నవంబర్ 19న 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. అల్లు సినిమాస్ తీరుపై తమ ఆవేదనను నేరుగా అల్లు అరవింద్‌కు తెలియజేశామంటూ '#AkasamLoOkaTara' హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన పోస్ట్ చేశారు. సామాన్య ప్రేక్షకుడి సమస్యపై అగ్రనిర్మాత తక్షణమే స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

'ఆకాశంలో ఒక తార' సందడి.. బాక్సాఫీస్ పోటీ

ఇదిలా ఉంటే, నిర్మాతగా అల్లు అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలతో జోరుమీదున్నారు. గతేడాది 'తండేల్', 'సింగిల్', 'ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రాలను నిర్మించిన ఆయన, ఈ ఏడాది 'ఆకాశంలో ఒక తార' సినిమాతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఆకాశంలో ఒక తార నవంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి నటించిన ఓం' (OM) సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇది గట్టి పోటీని ఎదుర్కొంటోంది. 'ఆకాశంలో ఒక తార' టికెట్ల బుకింగ్ సమయంలోనే ప్రేక్షకులు అరవింద్ దృష్టికి ఈ బ్లాకింగ్ సమస్యను తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.