...
...
Next Story

అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదం.. సారీ చెప్పిన కావేరి.. వేధించడం ఆపాలంటూ పాడ్ కాస్టర్ పోస్ట్.. పాడ్ కాస్ట్ డిలీట్

అల్లు అర్జున్ 42 రూల్స్ కాంట్రవర్సీలో కీలక పరిణామం. అల్లు అర్జున్ ను కలవడానికి ముందు తెలుసుకోవాల్సిన 42 డూస్ అండ్ డోంట్స్ ఇవే అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. అయితే ఫస్ట్ ఆ లిస్ట్ గురించి కామెంట్లు చేసిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి పబ్లిక్ గా సారీ చెప్పింది.

Published on: Feb 17, 2026, 11:05:08 IST
Advertisement

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదంలో మరో మలుపు. అల్లు అర్జున్ ను కలవడానికి ముందు అతని టీమ్ తనకు 42 'డూస్ అండ్ డోంట్స్' (చేయవలసినవి, చేయకూడనివి) జాబితాను ఇచ్చిందని రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో బ్రాండ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా పేర్కొంది. ఈ కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి.

సారీ చెప్పిన కావేరి

అల్లు అర్జున్ (PTI)
అల్లు అర్జున్ (PTI)

అల్లు అర్జున్ 42 రూల్స్ కాంట్రవర్సీలో ఇప్పటికే ఇలాంటి లిస్ట్ ఏం లేదని హీరో సంబంధిత వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావేరి బరువా పబ్లిక్ గా సారీ చెప్పింది. సోషల్ మీడియాలో పోస్టులో క్షమాపణాలు కోరింది. ఈ కామెంట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అల్లు అర్జున్ బృందం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఇప్పుడు బ్రాండ్ స్ట్రాటజిస్ట్, పాడ్‌కాస్టర్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.

కామెంట్లు వెనక్కి తీసుకుంటున్నా

పాడ్ కాస్టర్ కూడా

కావేరి బరువా కామెంట్లు ఓ పాడ్ కాస్టర్ షోలో వచ్చాయి. దీంతో పాడ్ కాస్టర్ స్వీకృతి కూడా సారీ చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భారీ పోస్టు పెట్టింది. ‘‘అల్లు అర్జున్ 'డూస్ అండ్ డోంట్స్' గురించి కావేరి ఆరోపించిన పాడ్‌కాస్ట్, రీల్ డిలీట్ చేశాం. పాడ్ కాస్ట్ ప్రసారం చేసే సమయానికి ఈ రూల్స్ గురించి నిజాలు తెలుసుకోలేకపోయాం. ఆమె చెప్పిన మాటలను నమ్మాం. అంతే తప్ప ఇందులో వేరే దురుద్దేశం లేదు’’ అని పోస్టులో పేర్కొన్నారు.

వేధింపులు ఆపాలని

‘‘ఇప్పుడు కావేరి తాజా కామెంట్లను బట్టి మేం ఆ పాడ్ కాస్ట్, రీల్ డిలీట్ చేశాం. యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించాం. ఈ నేపథ్యంలో పాడ్ కాస్టర్ హోస్ట్, ఇతర టీమ్ సభ్యులపై వేధింపులను ఆపాలని కోరుతున్నాం’’ అని ఆ పాడ్ కాస్టర్ తన పోస్టులో రాసుకొచ్చింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks