ధురంధర్ మూవీ చూసి డైరెక్టర్ భార్యకు సారీ చెప్పిన స్టార్ హీరోయిన్.. పుష్ప సినిమా పేరు.. రీజన్ ఇదే!
ధురంధర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ మూవీ ఇప్పటికీ వైరల్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా చూసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టండన్.. డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్యకు కాల్ చేసి సారీ చెప్పింది. దీనికి రీజన్ ఏంటో ఇక్కడ చూసేయండి.
థియేటర్లలో రిలీజై మూడు నెలలు గడిచిపోయినా ఇంకా ధురంధర్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ మూవీ వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా చూసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టండన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ధురంధర్ చూసిన తర్వాత డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య, హీరోయిన్ యామి గౌతమ్ కు కాల్ చేసి రవీనా సారీ చెప్పింది.

రవీనా సారీ
డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ధురంధర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీల మనసులనూ గెలుచుకుంది. ఈ సినిమా చూసిన తర్వాత తన రియాక్షన్ ను రవీనా టండన్ తాజాగా పంచుకుంది. యామి గౌతమ్ కు సారీ చెప్పినట్లు ఆమె జూమ్ స్పాట్ లైట్ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది.
భర్తకు అభిమానిగా
"నేను రీసెంట్ గా ధురంధర్ చూశా. వెంటనే యామి గౌతమ్ కు కాల్ చేసి సారీ చెప్పా. ‘ఐయామ్ సారీ. నేను మీ భర్త (ఆదిత్య ధర్)కు పెద్ద అభిమానిని. నా అటెన్షన్ గురించి మీ భర్తతో పంచుకోండి’ అని చెప్పా. ఎందుకంటే అతను చాలా కాలంగా మిస్ అయిన మూవీ ఫీలింగ్ ను తిరిగి తీసుకొచ్చాడు. పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ లాంటి సినిమాలు చూసినప్పుడు ఆడియన్స్ కు సంతృప్తి దక్కుతుంది’’ అని రవీనా టండన్ పేర్కొంది.
రణ్‌వీర్ నా ఫ్యాన్
ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్ తన ఫ్యాన్ అని చెప్పాడని ఈ సందర్భంగా రవీనా టండన్ వెల్లడించింది. అతను పదేళ్ల వయసులో నేను రొమాంటిక్ సాంగ్ చేస్తుంటే చూడటానికి వచ్చాడని తెలిపింది.
"అతను (రణ్‌వీర్) 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నేను ఒక రొమాంటిక్ సాంగ్ చేస్తుంటే చూడటానికి వచ్చాడు. నాకు ఫ్యాన్ అని చెప్పాడు. ధురంధర్ లో రణ్‌వీర్ ను లవ్ చేస్తున్నా. డైరెక్టర్ ఆదిత్య ఓ మేధావి. అతను మైండ్ బ్లోయింగ్ అనే పదానికి మించినవాడు. సంజయ్, అక్షయ్ చాలా అద్భుతంగా నటించారు. సారా చాలా తెలివైనది’’ అని రవీనా టండన్ చెప్పింది.
ధురంధర్ గురించి
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ తదితరులు నటించారు. ధురంధర్ లో రణ్‌వీర్ సింగ్ ఓ ఇండియన్ స్పై ఏజెంట్ గా నటించాడు.
సీక్వెల్
ధురంధర్ మూవీకి సీక్వెల్ గా ధురంధర్ ది రివేంజ్ థియేటర్లకు రాబోతుంది. మార్చి 19, 2026న ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు యష్ హీరోగా నటించిన టాక్సిక్ కూడా విడుదల అవుతుంది. టాక్సిక్ లో యష్ తో పాటు రుక్మిణి వసంత్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ తదితరులు నటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


