పుష్ప 2, కల్కిలను దాటేసిన ధురంధర్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్ ఇండియన్ సినిమాగా రికార్డ్!
రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా రికార్డుల దూకుడు కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మరో హిస్టరీ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఓటీటీని షేక్ చేస్తున్న ఈ మూవీ అత్యధిక కాలం ట్రెండింగ్ లో ఉన్న చిత్రంగా నిలిచింది.
లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ధురంధర్ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 5, 2025న థియేటర్లలో రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మరో హిస్టరీ క్రియేట్ చేసింది. తాజాగా టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో అత్యధిక కాలం పాటు ట్రెండింగ్ లో ఉన్న సినిమాగా కొత్త రికార్డు నెలకొల్పింది.

ధురంధర్ రికార్డు
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఇందులో రణ్‌వీర్ సింగ్ హీరో. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ధురంధర్ మూవీ క్రేజ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం గత సంవత్సరం విడుదలైనప్పటి నుండి ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
అత్యధిక కాలం ట్రెండింగ్
బుక్ మై షోలో అత్యధిక కాలం పాటు ట్రెండింగ్ లో ఉన్న ఇండియన్ సినిమాగా ధురంధర్ నిలిచింది. ఈ సినిమా 59 రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. 2025లో విక్కీ కౌశల్ నటించిన ఛావా మూవీ నెలకొల్పిన 58 రోజుల రికార్డును ధురంధర్ దాటేసింది. బలమైన మౌత్ పబ్లిసిటీతో ధురంధర్ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
లిస్ట్ లో పుష్ప 2
బుక్ మై షోలో అత్యధిక కాలం పాటు ట్రెండింగ్ లో ఉన్న సినిమాల జాబితాలో పుష్ప 2 కూడా ఉంది. ధురంధర్, ఛావా తొలి రెండు స్థానాల్లో ఉండగా.. స్త్రీ 2 ఏమో 57 రోజులతో మూడో ప్లేస్ లో ఉంది.
'ప్రేమలు', 'పుష్ప 2: ది రూల్' రెండు సినిమాలూ 53 రోజుల పాటు ట్రెండింగ్ లో ఉండి నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. 'మంజుమ్మల్ బాయ్స్' 50 రోజులతో అయిదో ప్లేస్ లో ఉంది. ‘కల్కి 2898 AD’ మూవీ 49 రోజులతో, జవాన్ 48 రోజులతో, లోకా ఛాప్టర్ 1 సినిమా 46 రోజులతో, మహావతార్ నరసింహ 42 రోజులతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మూవీ విక్టరీ
బుక్ మై షోలో ఓ మూవీ ఎంతకాలం ట్రెండ్ అవుతుందనేది ఈ సినిమా విక్టరీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది మొత్తం బాక్సాఫీస్ ట్రెండ్ ను కూడా సూచిస్తోంది. సినిమా మొత్తం అమ్మకాలలో సగం ఈ బుక్ మై షో ద్వారానే వస్తున్నాయి. ధురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు కలెక్ట్ చేసింది. దీని సీక్వెల్ ధురంధర్ ది రివేంజ్ మార్చి 19, 2026న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


