...
...
Next Story

Allu Arjun Fans: అల్లు అర్జున్ ఇంటికి పోటెత్తిన అభిమానులు.. పోలీసుల లాఠీఛార్జ్.. బన్నీకి బర్త్‌డే విషెస్ కోసం ఆరాటం

Allu Arjun Fans: అల్లు అర్జున్ కు బర్త్ డే విషెస్ చెప్పడానికి అభిమానులు ఎగబడ్డారు. జూబ్లీహిల్స్ లోని అతని ఇంటి దగ్గరికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి కలిగింది.

Published on: Apr 8, 2026, 18:06:53 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Allu Arjun Fans: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో అతని అభిమానుల సందడి వేరే లెవల్‌లో ఉంటుంది. అయితే ఈసారి ఆ ఉత్సాహం హద్దులు దాటింది. తన అభిమాన నటుడిని ఒక్కసారి చూడాలనే ఆరాటంతో మంగళవారం (ఏప్రిల్ 7) అర్ధరాత్రి నుంచే వేలాది మంది అభిమానులు హైదరాబాద్‌లోని బన్నీ నివాసానికి చేరుకున్నారు. జనసందోహం అనూహ్యంగా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.

అర్ధరాత్రి నుంచే జూబ్లీహిల్స్‌లో ‘జాతర’

Allu Arjun Fans: అల్లు అర్జున్ ఇంటికి పోటెత్తిన అభిమానులు.. పోలీసుల లాఠీఛార్జ్.. బన్నీకి బర్త్‌డే విషెస్ కోసం ఆరాటం
Allu Arjun Fans: అల్లు అర్జున్ ఇంటికి పోటెత్తిన అభిమానులు.. పోలీసుల లాఠీఛార్జ్.. బన్నీకి బర్త్‌డే విషెస్ కోసం ఆరాటం

మంగళవారం రాత్రి నుంచే జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి పరిసరాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ప్లకార్డులు, కేకులు, బహుమతులతో వచ్చిన ఫ్యాన్స్.. ‘జై బన్నీ’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. జనాన్ని నియంత్రించడం సెక్యూరిటీ సిబ్బందికి సాధ్యం కాకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తోపులాట జరగకుండా ఉండేందుకు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఈ ఉత్సాహాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ.. "పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్. నీవు ఎప్పుడూ ఇలాగే సెలబ్రేట్ చేయబడాలి" అని పోస్ట్ చేశాడు.

అభిమానుల కోసం గోడ ఎక్కి మరీ..

బుధవారం (ఏప్రిల్ 8) ఉదయం తన ఇంటి వెలుపల వేచి ఉన్న అభిమానులను అల్లు అర్జున్ స్వయంగా కలిశాడు. ఒక అభిమాని అయితే ఏకంగా 'పుష్ప 2' లోని గంగమ్మ జాతర గెటప్‌లో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మొదట బారికేడ్ల వెనుక నుంచి అభివాదం చేసిన బన్నీ.. అభిమానుల కోరిక మేరకు గోడపైకి ఎక్కి మరీ అందరికీ అభివాదం చేశాడు. తనపై చూపిస్తున్న ఈ అంతులేని ప్రేమకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపాడు. కొందరు అభిమానుల చేతులను తాకుతూ వారిని పలకరించడం అక్కడ ఉన్న వారిని మురిపించింది.

పుష్పరాజ్ కెరీర్‌ను మార్చిన ‘ది రూల్’

బన్నీ 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే తదుపరి మూవీ టైటిల్‌ను ‘రాకా’ (Raaka) గా ప్రకటించారు.

"రాకా అనేది కేవలం ఒక సినిమా కాదు.. 18 ఏళ్లుగా నా మనసులో ఉన్న ఒక ఆలోచన. ఇది కేవలం ఆరంభం మాత్రమే," అని అట్లీ ట్వీట్ చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు.

ఈ పోస్టర్‌లో బన్నీ మేకోవర్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొందరు విక్రమ్, కార్తీ సినిమాలతో పోలుస్తున్నప్పటికీ, బన్నీ ట్రాన్స్‌ఫర్మేషన్ మాత్రం అదిరిపోయిందని ప్రశంసిస్తున్నారు. దీనితో పాటు లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా వంటి క్రేజీ దర్శకులతో కూడా బన్నీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన సినిమా పేరు ఏమిటి?

దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమా టైటిల్‌ను ‘రాకా’ (Raaka) గా ప్రకటించారు.

2. పుష్ప 2: ది రూల్ సాధించిన మొత్తం వసూళ్లు ఎంత?

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకు పైగా వసూలు చేసి, తెలుగు సినీ చరిత్రలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

3. అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చింది?

పుట్టినరోజు సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో, తోపులాట జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు.

4. అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్టులు ఎవరితో ఉన్నాయి?

అట్లీ (రాకా)తో పాటు లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బన్నీ సినిమాలు చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe