పుష్ప సినిమాలతో పాన్ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో రికార్డులు తిరగరాస్తున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్లో మూవీ అంటే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. అదే హైప్ ను కొనసాగిస్తూ అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చే మూవీ అనౌన్స్ మెంట్ థీమ్ వీడియోనే హిస్టరీ క్రియేట్ చేసేసింది.
ఏఏ23 థీమ్ వీడియో

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. దీనిపై ఇప్పటికే అనౌన్స్ మెంట్ వచ్చింది. 23థీమ్ పేరుతో ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అడవిలో జంతువులతో సాగుతూ, చివర్లో గుర్రంపై హీరో ఎంట్రీతో ఉండే ఈ థీమ్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇప్పుడు కొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
కొత్త హిస్టరీ
అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూవీ థీమ్ వీడియో కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమా 23థీమ్ వీడియోపై ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ప్లస్ రీల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 1 మిలియన్ రీల్స్ అందుకున్న ఫస్ట్ మూవీ థీమ్ వీడియో ఇదే అని ప్రకటించింది.
‘‘అనౌన్స్ మెంట్ వీడియోతోనే సోషల్ మీడియాలో ఫైర్ పుట్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైెరెక్టర్ లోకేష్. 23థీమ్ వీడియోకు ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ప్లస్ రీల్స్. మిలియన్ రీల్స్ అందుకున్న ఫస్ట్ థీమ్ వీడియో. 2026లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది’’అని ఎక్స్ లో మైత్రి మూవీ మేకర్స్ పోస్టు చేసింది.
2026లో షూటింగ్
లోకేష్ కనగరాజ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ను 2026లోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మరో తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ కోసం బన్నీ రెడీ కాబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బన్నీవాస్ వర్క్స్ నిర్మిస్తున్నాయి. అనిరుధర్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
అల్లు అర్జున్ లైనప్
{{/usCountry}}లోకేష్ కనగరాజ్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ను 2026లోనే స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం మరో తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ కోసం బన్నీ రెడీ కాబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బన్నీవాస్ వర్క్స్ నిర్మిస్తున్నాయి. అనిరుధర్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
అల్లు అర్జున్ లైనప్
{{/usCountry}}అల్లు అర్జున్ లైనప్ క్రేజీగా ఉంది. ఇప్పుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుంది. అనంతరం సుకుమార్ తో పుష్ప 3 ఉంటుందని అంటున్నారు. ఇక సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్ట్ పై రీసెంట్ గా ప్రొడ్యూసర్ క్లారిటీనిచ్చాడు. సినిమా ఉంటుందని పేర్కొన్నాడు.