Raaka: ‘రాకా’ అంటూ బాక్సాఫీస్ రికార్డులు దుమ్ము దులుపేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. తమిళ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా రాకా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాకా షూటింగ్ అప్ డేట్

'రాకా' అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతోంది. కాగా, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల నుంచి అందింది.
భారీ షెడ్యూల్
రాకా సినిమాకు సంబంధించిన ఒక భారీ లాంగ్ షెడ్యూల్‌ను జూన్ మధ్య వారం నుంచి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. ప్యారిస్ వెకేషన్ ముగించుకుని అల్లు అర్జున్ భారత్‌కు తిరిగి రాగానే ఈ ముంబై షెడ్యూల్ పట్టాలెక్కనుంది.
ప్రధాన నటులు
ముంబైలో జరగనున్న ఈ అత్యంత కీలకమైన షెడ్యూల్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కూడా జాయిన్ కానుంది. వీరితో పాటు వర్సటైల్ యాక్టర్ జిమ్ సర్బ్, 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్, మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్‌తో కూడిన ప్రధాన తారాగణం అంతా ఈ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.
సినిమా కథాగమనాన్ని మలుపు తిప్పే కీలకమైన ఎమోషనల్ సీన్స్, భారీ యాక్షన్ బ్లాకులను ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేశాడని సమాచారం.
దాదాపుగా కంప్లీట్
{{/usCountry}}సినిమా కథాగమనాన్ని మలుపు తిప్పే కీలకమైన ఎమోషనల్ సీన్స్, భారీ యాక్షన్ బ్లాకులను ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించాలని దర్శకుడు అట్లీ ప్లాన్ చేశాడని సమాచారం.
దాదాపుగా కంప్లీట్
{{/usCountry}}ఈ మెగా షెడ్యూల్ ముగిసే సమయానికి సినిమాలోని అత్యంత సంక్లిష్టమైన, రిస్కీ యాక్షన్ సీక్వెన్సుల చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని ఇన్సైడ్ టాక్. దీని తర్వాత మిగిలిన భాగంలో కేవలం టాకీ పార్ట్, కొన్ని డ్రామా సీన్లు మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మేకర్స్ ముందుకు సాగుతున్నారు.
డిఫరెంట్ స్ట్రాటజీ
నిజానికి రాకా సినిమా షూటింగ్ ప్రాసెస్ చాలా విభిన్నంగా, పక్కా ప్లానింగ్‌తో జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ (VFX), సిజిఐ (CGI) ప్రాధాన్యత ఉన్న సంక్లిష్టమైన సన్నివేశాలను చిత్ర యూనిట్ ముందే ప్లాన్ చేసుకుంది. గత ఏడాది కాలంగా ఈ హై-ఎండ్ గ్రాఫిక్స్ సీన్ల షూటింగ్‌ను ప్రాధాన్యత క్రమంలో ముందుగా పూర్తి చేస్తూ వచ్చారు.
దీనివల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం దొరకడమే కాకుండా, ఓవరాల్‌గా షూటింగ్ ప్రక్రియ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగేందుకు వీలైంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న రాకా చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని విభిన్న అవతారంలో కనిపించనున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.