...
...
Next Story

Allu Arjun Father's Day Post: 'ఆయనే నేను చూస్తున్న ఏకైక దేవుడు'.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. అసలు మాస్టర్ మైండ్!

Allu Arjun Father's Day Post: అల్లు అర్జున్ ఇవాళ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఆయనే నా దైవం అంటూ రాసుకొచ్చాడు. మరి అల్లు అర్జున్ ఎందుకు ఈ పోస్టు పెట్టాడు? ఐకాన్ స్టార్ సక్సెస్ వెనుకాల ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? అన్నది ఇక్కడ చూసేయండి.

Published on: Jun 21, 2026 04:43 PM IST
Advertisement

Allu Arjun Father's Day Post: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం (జూన్ 21) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌పై ఉన్న అమితమైన ప్రేమాభిమానాలను అల్లు అర్జున్ చాటుకున్నాడు.

అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్

'ఆయనే నేను చూస్తున్న ఏకైక దేవుడు'.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ (x/alluarjun)
'ఆయనే నేను చూస్తున్న ఏకైక దేవుడు'.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ (x/alluarjun)

సోషల్ మీడియాలో అల్లు అర్జున్ షేర్ చేసిన ఒక ఎమోషనల్ నోట్ ప్రస్తుతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ నెట్టింట టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఎంతటి బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పటికీ కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రికి ప్రాధాన్యత ఇవ్వడంలో బన్నీ ఎప్పుడూ ముందే ఉంటాడని ఈ పోస్ట్ మరోసారి నిరూపించింది.

ఆయనే దేవుడు

అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాంటే.. "నాకు మా నాన్నే దేవుడు. నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నా జీవితంలో నాకు అన్నీ ఇచ్చింది ఆయనే. హ్యాపీ ఫాదర్స్ డే టు మై డాడ్ అండ్ ఎవ్రీ స్వీట్ డాడ్ ఇన్ ది వరల్డ్" అంటూ ఒక బ్లాక్ హార్ట్ ఎమోజీతో పోస్టు చేశాడు ఐకాన్ స్టార్. అల్లు అరవింద్‌తో ఉన్న ఫొటోను కూడా అల్లు అర్జున్ షేర్ చేశాడు.

ఆ మాస్టర్‌మైండ్

ముఖ్యంగా మెగా క్యాంప్ సపోర్ట్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్‌కంటూ ఒక ప్రత్యేకమైన 'ఐకాన్' ఇమేజ్ క్రియేట్ చేయడంలో అల్లు అరవింద్ మార్క్ కనిపిస్తోంది. మలయాళ మార్కెట్‌ను ముందే పసిగట్టి అక్కడ 'మల్లు అర్జున్'గా ప్రమోట్ చేయడం, ఆపై గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సరైన కథలను ఎంచుకోవడం వంటివన్నీ అల్లు అరవింద్ అనే పక్కా బిజినెస్ మైండ్ వల్లే సాధ్యమయ్యాయి.

బన్నీ కెరీర్ మైల్‌స్టోన్స్

ప్రస్తుతం అల్లు అర్జున్ తన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రాల షూటింగ్‌లతో ఎంతో బిజీగా గడుపుతున్నాడు. పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యాడు. ఈ హెక్టిక్ షెడ్యూల్స్, విపరీతమైన క్రేజ్ ప్రెజర్ మధ్య కూడా తన విజయాల వెనుక ఉన్న తండ్రిని స్మరించుకుంటూ బన్నీ రాసిన మాటలు ప్రతి ఒక్కరి గుండెలను హత్తుకుంటున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe