...
...
Next Story

Allu Arjun: ప్రభాస్ ట్యాగ్‌ను అల్లు అర్జున్‌కు తగిలించారా?.. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ‘రెబెల్ స్టార్’ రచ్చ.. ట్రోల్స్ మోత!

Allu Arjun: ఫోర్బ్స్ ఇండియా ఆగస్టు మ్యాగజైన్ వివాదానికి దారితీసింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను 'రెబెల్ స్టార్' అని పేర్కొనడంపై తీవ్ర వివాదం రేగింది. ప్రభాస్ ట్యాగ్ ను అల్లు అర్జున్ కు వాడటంపై నెట్టింట ట్రోల్స్ మోత మోగుతోంది.

Published on: Sep 4, 2026, 05:39:57 IST
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ లెవల్ లో మరోసారి ట్రెండింగ్ గా మారారు. పాపులర్ బిజినెస్ మ్యాగజైన్ 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) ఆగస్టు నెల ఎడిషన్ కవర్ పేజీపై అల్లు అర్జున్ స్పెషల్ గా మారారు. అయితే ఈ ఎడిషన్ లో వచ్చిన అల్లు అర్జున్ స్పెషల్ స్టోరీ తీవ్ర వివాదానికి దారితీసింది.

​'రెబెల్ స్టార్' వివాదం

ప్రభాస్ ట్యాగ్‌ను అల్లు అర్జున్‌కు తగిలించారా?.. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ‘రెబెల్ స్టార్’ రచ్చ.. ట్రోల్స్ మోత!
ప్రభాస్ ట్యాగ్‌ను అల్లు అర్జున్‌కు తగిలించారా?.. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ‘రెబెల్ స్టార్’ రచ్చ.. ట్రోల్స్ మోత!

ఫోర్బ్స్ మ్యాగజైన్ తమ కవర్ పేజీ స్టోరీలో అల్లు అర్జున్‌ను 'రెబెల్ స్టార్' (Rebel Star) అని పేర్కొనడం తీవ్ర దుమారం రేపుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో 'రెబెల్ స్టార్' అనే బిరుదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు, ఆయన పెదనాన్న దివంగత కృష్ణంరాజుకు మాత్రమే సొంతం. దశాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్షకులు గుండెల్లో నింపుకున్న ఈ ఐకానిక్ బిరుదును అల్లు అర్జున్‌కు ఆపాదించడంపై ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​పొరపాటా? లేక ప్రచార వ్యూహమా?

ఈ వ్యవహారంపై సినీ విశ్లేషకులు భిన్న కోణాల్లో చర్చిస్తున్నారు. సాధారణంగా ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు కవర్ పేజీ ముద్రించే ముందు సంబంధిత నటుడికి లేదా వారి పీఆర్ (PR) టీమ్‌కు ప్లానింగ్ ప్రూఫ్ పంపి ముందస్తు అనుమతి తీసుకుంటాయి.

నటుడి లేదా వాళ్ల అఫీషియల్ టీమ్ ఆమోదం లేకుండా ఏ ప్రముఖ పత్రిక కూడా ఇలాంటి కథనాలను ప్రచురించదు. అలాంటప్పుడు ఈ పొరపాటు ఎలా జరిగింది? ఇది ఫోర్బ్స్ ఎడిటోరియల్ టీమ్ చేసిన పొరపాటా? లేక కవర్ స్టోరీకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చేందుకు చేసిన వ్యూహాత్మక ప్రయత్నమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు మెగాస్టార్

'మెగాస్టార్' ట్యాగ్ అనేది చిరంజీవికే సొంతమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు 'రెబెల్ స్టార్' ప్రస్తావన రావడంతో అల్లు అర్జున్ పై ట్రోల్స్ మోత మోగుతోంది.

ట్యాగ్ సంపాదించుకోవాలి

అల్లు అర్జున్ ను మొదట్లో స్టైలిష్ స్టార్ అనేవాళ్లు. అయితే పుష్ప సినిమాతో ఆయన్ని ఐకాన్ స్టార్ చేశారు సుకుమార్. మరి ఇప్పుడేమో రెబెల్ స్టార్ అంటూ ఆర్టికల్ రావడం కలకలం రేపుతోంది. ట్యాగ్ సంపాదించుకోవాలని, ఇలా వేరొకరిది వాడుకోవడం కాదనే విమర్శలు వస్తున్నాయి.

"బిరుదులు అనేవి ప్రేక్షకుల అభిమానంతో సొంతం చేసుకోవాలి తప్ప, ప్రచారం కోసం స్వయంగా తగిలించుకుంటే రావు" అని నెట్టింట్లో ట్రోల్స్ వస్తున్నాయి.

​ఇమేజ్‌కు ముప్పు

ఇలాంటి వివాదాలు అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్‌కు, సోషల్ మీడియా క్రేజ్‌కు హాని కలిగిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనవసరమైన ఫ్యాన్ వార్స్‌కు దారితీసే ముందే, అల్లు అర్జున్ పర్సనల్ పీఆర్ టీమ్ స్పందించి ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe