Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మరోసారి ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అందుకు ఓ బలమైన కారణం ఉంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ అల్లు అర్జున్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన ఈ రోజు (ఆగస్టు 15) పోస్టు చేసిన ఫొటో ఒకటి పెను దుమారమే రేపుతోంది.
అల్లు అర్జున్ ట్వీట్

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ ఫొటో పోస్టు చేశారు. ఈ ఫొటోలో ఎర్రకోట మీద భారత జాతీయ పతాకం ఎగురుతున్నట్లు ఉంది. కోట కింద అల్లు అర్జున్ ‘ఏఏ’లోగోతో పాటు పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడీ ఫొటోతోనే కాంట్రవర్సీ రేకెత్తింది.
అశోక చక్రం మిస్సింగ్
అల్లు అర్జున్ పోస్టు చేసిన ఫొటోలో ఎగురుతున్నట్లు ఉన్న త్రివర్ణ పతాకం మధ్యలో అశోక చక్రం లేదు. అసలు కనిపించడం లేదు. దీంతో అశోక చక్రం లేకుండా భారత జెండా ఉంటుందా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది గమనించిన అల్లు అర్జున్ ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేశారు. కానీ ఆ రచ్చ మాత్రం ఆగడం లేదు.
లోగో వేసుకున్నావ్ కదా
అల్లు అర్జున్ చేసిన పొరపాటుపై కొంతమంది నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘జెండాలో అశోక చక్రం లేకుండా, ఎర్ర కోట మీద ఏఏ లోగో ఉండేలా ఇండిపెండెన్స్ ట్వీట్ చేశారు. ఇప్పుడు విమర్శలు వచ్చేసరికి డిలీట్ చేశారు. ఇండిపెండెన్స్ డే కోసం కూడా ఇలా అటెన్షన్ కోరుకోవడం ఎందుకు?’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
జెండాను అవమానించడమే
{{/usCountry}}జెండాను అవమానించడమే
{{/usCountry}}‘‘అశోక చక్రం లేకుండా జెండా ఫోటోను పెట్టడమంటే భారత జాతీయ పతాకాన్ని అవమానించడమే. వెంటనే అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి’’ అని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు.
ఇది పొరపాటు మాత్రమే
అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్, కొంతమంది నెటిజన్లు ఈ హీరోకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ‘‘తీవ్రమైన విమర్శల తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ డిలీట్ చేశారు. ఈ పొరపాటు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆయన దేశభక్తిని ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు’’ అని మరొకరు ట్వీట్ చేశారు.
ఏది ఏమైనా అల్లు అర్జున్ లాంటి హీరో ఒక పోస్టును సోషల్ మీడియాలో పెట్టేముందు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ మారిన హీరో నుంచి ఇలాంటిది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయరని కొంతమంది అంటున్నారు.