Raaka: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో అల్లు అర్జున్ ‘రాకా’ ఒకటి. రీసెంట్ గా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ తో ఈ మూవీపై హైప్ ఆకాశాన్ని తాకింది. ఈ అంచనాలను మరింత పెంచేలా రాకా మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ చేసిన కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
ఇంటర్నేషనల్ లెవల్

రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటుందనే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ కామెంట్లు ఉన్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను రాకా మ్యూజిక్ పై అదిరే అప్ డేట్ ఇచ్చాడు. మూవీ డైరెక్టర్ అట్లీకి ఫస్ట్ డే నుంచి కూడా సౌండ్ ట్రాక్ పై ఓ ఐడియా ఉందని సాయి పేర్కొన్నాడు.
రాకా సాంగ్స్
‘‘రాకా కోసం ఫస్ట్ డే అట్లీ అన్నను కలిసినప్పుడే ఈ మూవీ సౌండ్ ట్రాక్ ఎలా తీర్చిదిద్దాలన్న దానిపై అతని ఐడియా గురించి తెలిసింది. చాలా పాటలపై కసరత్తు చేశాం. రాకా మూవీ సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఇది ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్లబోతుందని నమ్ముతున్నా. ఇంటర్నేషనల్ సింగర్స్, లిరిసిస్ట్ లు ఇందులో భాగమయ్యారు. అల్లు అర్జున్ సార్ కు మ్యూజిక్ అంటే ప్రేమ’’ అని సాయి అభ్యంకర్ తెలిపాడు.
1000 పాటలు
తన కెరీర్, సోషల్ మీడియా గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో సాయి అభ్యంకర్ మాట్లాడాడు. ‘‘ఆరో క్లాస్ లో ఉన్నప్పటి నుంచే సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే వెయ్యికి పైగా పాటలు రెడీ చేశా. నేను 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటలను వాడుకుంటా. ఒకవేళ అప్పుడు నా మెంటల్ కండీషన్ మారితే ఈ పాటలు నాకు సపోర్ట్ గా నిలుస్తాయి’’ అని సాయి పేర్కొన్నాడు.
{{/usCountry}}తన కెరీర్, సోషల్ మీడియా గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో సాయి అభ్యంకర్ మాట్లాడాడు. ‘‘ఆరో క్లాస్ లో ఉన్నప్పటి నుంచే సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే వెయ్యికి పైగా పాటలు రెడీ చేశా. నేను 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటలను వాడుకుంటా. ఒకవేళ అప్పుడు నా మెంటల్ కండీషన్ మారితే ఈ పాటలు నాకు సపోర్ట్ గా నిలుస్తాయి’’ అని సాయి పేర్కొన్నాడు.
{{/usCountry}}సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను సాధారణంగా అయిదారు గంటలు మాత్రమే పడుకుంటా. ఈ ట్రోల్స్ కు దూరంగా ఉంటా. సోషల్ మీడియాకు ఇంకా దూరంగా ఉంటా. అందుకే బేసిక్ నోకియా ఫోన్ కొనుకున్నా’’ అని సాయి వెల్లడించాడు.
ఫస్ట్ లుక్ తో
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’. రీసెంట్ గా ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ లుక్ తో ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రాకా మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్.