Allu Arjun Raaka: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తీవ్ర గాయానికి గురికావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రాకా' షూటింగ్ ప్లాన్స్ పూర్తిగా మారిపోయాయి. 'మైసా' సినిమా డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో రష్మిక కుడి తొంటి కండరం (Hip Tendon Detachment) దెబ్బతినడంతో డాక్టర్లు ఆమెను కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
షూటింగ్‌కు 45 రోజుల బ్రేక్

ఈ ఊహించని పరిణామాంతొ డైరెక్టర్ అట్లీ ఈ రాకా సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను దాదాపు 45 రోజులు ముందుకు జరపాల్సి వచ్చిందని వెరైటీ ఇండియా తన రిపోర్టులో వెల్లడించింది. రష్మిక ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడిన తర్వాతే ఆమెతో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాలని చిత్ర బృందం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.
అట్లీ సెన్సిటివ్ నిర్ణయం.. రష్మిక ఆరోగ్యానికి ప్రాధాన్యం
'రాకా' సినిమాలో రష్మిక మందన్న పోషిస్తున్న పాత్ర చాలా ఇంటెన్స్‌గా, శారీరకంగా కష్టంతో కూడుకున్న యాక్షన్ సీక్వెన్సెస్‌తో ఉండబోతోంది. ఇలాంటి సమయంలో ఆమెను షూటింగ్‌కు రప్పించి ఇబ్బంది పెట్టడం సరికాదని డైరెక్టర్ అట్లీ భావించారు. రష్మిక పూర్తిగా కోలుకున్న తర్వాతే సెట్స్‌పైకి రావాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో రెస్ట్ తీసుకుంటున్న రష్మిక, సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో తిరిగి కెమెరా ముందుకు వచ్చే అవకాశం ఉంది. రష్మిక లేని సీన్లను తెరకెక్కించే ప్రత్యామ్నాయ ప్లాన్స్‌ను మేకర్స్ ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.
700 కోట్లతో అట్లీ విజన్.. భారీ స్థాయిలో రాకా
'తెరి', 'మెర్సల్', 'బిగిల్', 'జవాన్' లాంటి బ్లాక్‌బస్టర్లతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ.. అల్లు అర్జున్‌తో కలసి ఈ సైన్స్ ఫిక్షన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ దాదాపు రూ.700 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రష్మికతో పాటు దీపికా పదుకోన్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. రీసెంట్‌గానే దీపికా పదుకోన్ పై ముంబైలో కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్లు చిత్రీకరించిన అట్లీ.. రష్మిక ట్రాక్ కోసం షెడ్యూల్స్ రీ-డిజైన్ చేస్తున్నారు.
లైనప్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లు.. 'మైసా', ‘రణబాలి’
{{/usCountry}}ఈ సినిమాలో రష్మికతో పాటు దీపికా పదుకోన్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. రీసెంట్‌గానే దీపికా పదుకోన్ పై ముంబైలో కొన్ని ఇంటెన్స్ యాక్షన్ సీన్లు చిత్రీకరించిన అట్లీ.. రష్మిక ట్రాక్ కోసం షెడ్యూల్స్ రీ-డిజైన్ చేస్తున్నారు.
లైనప్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌లు.. 'మైసా', ‘రణబాలి’
{{/usCountry}}కేవలం 'రాకా' మాత్రమే కాకుండా రష్మిక చేతిలో మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. గోండు గిరిజన ప్రాంత నేపథ్యంతో తెరకెక్కుతున్న 'మైసా' సినిమాలో రష్మిక లీడ్ రోల్ చేస్తోంది. కొత్త దర్శకుడు రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా డ్యాన్స్ షూట్‌లోనే ఈ ఊహించని గాయం అయింది.
దీనితో పాటు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలసి 'రణబాలి' అనే పిరియాడికల్ యాక్షన్ డ్రామాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు బన్నీ 'రాకా' మూవీతో బాక్సాఫీస్ దగ్గర నేషనల్ క్రష్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.