బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్యాక్డ్ మూవీ ధురంధర్ 2. ఈ ఎపిక్ బ్లాక్‌బస్టర్‌పై ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. సినిమా చూసిన వెంటనే తన ఎక్సైట్‌మెంట్‌ను ఆపుకోలేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఒక అదిరిపోయే రివ్యూ ఇచ్చాడు. తన బ్రదర్ రణ్‌వీర్ సింగ్ యాక్టింగ్‌ను, ఆదిత్య ధర్ టేకింగ్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ బన్నీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ రివ్యూలో ఏముందంటే..

అల్లు అర్జున్ తన పోస్ట్‌లో ధురంధర్ 2 సినిమాను ఓ రేంజ్‌లో పొగిడాడు. దేశభక్తితో కూడిన స్వాగ్ మూవీలో ఉందని, మాధవన్, రణ్‌వీర్ ఇరగదీశారని చెప్పాడు.
"ఇప్పుడే ధురంధర్ 2 సినిమా చూశాను. ఇది పక్కా స్వాగ్‌తో కూడిన దేశభక్తి. ప్రతి దేశభక్తుడిని గర్వపడేలా చేసే సినిమా ఇది. థియేటర్‌లో చప్పట్లు కొట్టించే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఒకే మాటలో చెప్పాలంటే బ్లాస్ట్. ఎంటైర్ టీమ్‌కి నా అభినందనలు. మాధవన్ గారితో పాటు మిగతా యాక్టర్స్ అందరూ అద్భుతంగా నటించారు. టెక్నికల్ బ్రిలియన్స్ సూపర్బ్" అని అల్లు అర్జున్ తన రివ్యూలో అన్నాడు.
రణ్‌వీర్ నా బ్రదర్.. గర్వకారణం
రణ్‌వీర్ సింగ్‌తో తనకున్న సోదర బంధాన్ని చూపిస్తూ బన్నీ ఇంకా ఇలా రాసుకొచ్చాడు.. "మన దేశంలో నా బ్రదర్ రణ్‌వీర్ సింగ్ లాంటి బ్రిలియంట్ అండ్ వర్సటైల్ యాక్టర్ ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఆర్వీఎస్ ఆన్ ఫైర్. డైరెక్టర్ ఆదిత్య ధర్ గారు ఇరగదీసేశారు. మన దేశంలో ఆయన లాంటి బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక షో రాకర్. ఇది మన ఇండియన్ స్టోరీ... కానీ ఇంటర్నేషనల్ స్వాగ్. జై హింద్" అంటూ అల్లు అర్జున్ తన పోస్ట్‌ను ఫుల్ ఎనర్జీతో ముగించాడు.
పాన్ ఇండియా లెవల్‌లో ట్రెండింగ్..
'పుష్ప' లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇలా ఒక బాలీవుడ్ సినిమాను, అందులోనూ దేశభక్తి నేపథ్యంతో వచ్చిన సినిమాను ఇంతలా పొగడటం విశేషమే. నిజానికి బన్నీ ఒక్కడే కాదు ధురంధర్ 2 మూవీ ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయడంలో ఆర్జీవీ, తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఎపిక్ బ్లాక్‌బస్టర్ అని తరణ్ ట్వీట్ చేయగా.. ఈ సినిమా ముందు మొఘల్-ఇ –ఆజం కూడా ఓ టీవీ షో అవుతుందని ఆర్జీవీ అన్నాడు. స్పీల్బర్గ్, క్రిస్టఫర్ నోలన్ లాంటి డైరెక్టర్లు కూడా ఈ సినిమాను చూడాలని అతడు అనడం విశేషం.
{{/usCountry}}'పుష్ప' లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ఇలా ఒక బాలీవుడ్ సినిమాను, అందులోనూ దేశభక్తి నేపథ్యంతో వచ్చిన సినిమాను ఇంతలా పొగడటం విశేషమే. నిజానికి బన్నీ ఒక్కడే కాదు ధురంధర్ 2 మూవీ ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయడంలో ఆర్జీవీ, తరణ్ ఆదర్శ్ లాంటి వాళ్లు కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఎపిక్ బ్లాక్‌బస్టర్ అని తరణ్ ట్వీట్ చేయగా.. ఈ సినిమా ముందు మొఘల్-ఇ –ఆజం కూడా ఓ టీవీ షో అవుతుందని ఆర్జీవీ అన్నాడు. స్పీల్బర్గ్, క్రిస్టఫర్ నోలన్ లాంటి డైరెక్టర్లు కూడా ఈ సినిమాను చూడాలని అతడు అనడం విశేషం.
{{/usCountry}}