...
...
Next Story

తమ్ముడిని చూసి గర్వపడుతున్న అల్లు అర్జున్.. రోహిత్ శర్మతో అల్లు శిరీష్ యాడ్.. బన్నీ పోస్ట్ వైరల్

తమ్ముడు అల్లు శిరీష్ ను చూసి గర్వపడుతున్నాడు అల్లు అర్జున్. తాజాగా శిరీష్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓ యాడ్ చేశాడు. దానిని ఇన్‌స్టా స్టోరీస్ లో షేర్ చేసిన బన్నీ.. అది చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు.

Published on: Dec 18, 2025, 17:36:44 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అల్లు శిరీష్, టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మతో కలిసి ఒక యాడ్‌లో నటించాడు. ఇది చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థ్రిల్ అయ్యాడు. తమ్ముడిని చూసి గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టాడు. శిరీష్, రోహిత్ శర్మల ఈ ఊహించని కలయిక ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

అల్లు శిరీష్ యాడ్.. బన్నీ రియాక్షన్ ఇలా..

తమ్ముడిని చూసి గర్వపడుతున్న అల్లు అర్జున్.. రోహిత్ శర్మతో అల్లు శిరీష్ యాడ్.. బన్నీ పోస్ట్ వైరల్
తమ్ముడిని చూసి గర్వపడుతున్న అల్లు అర్జున్.. రోహిత్ శర్మతో అల్లు శిరీష్ యాడ్.. బన్నీ పోస్ట్ వైరల్

అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ యాడ్‌లో సందడి చేశారు. ఇందులో రోహిత్ సతీమణి రితికా సజ్దే కూడా కనిపించింది. వీరిద్దరి కాంబినేషన్ చూసి అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు. ఆ విషయాన్నే చెబుతూ ఇన్‌స్టా స్టోరీస్ లో గురువారం (డిసెంబర్ 18) ఓ పోస్ట్ చేశాడు.

అల్లు అర్జున్ రియాక్షన్: "గర్వంగా ఉంది సిరి.."

ఈ యాడ్ చూసిన వెంటనే అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించాడు. "ఎంత మంచి సర్ ప్రైజ్! వావ్ సిరి.. నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా, గర్వంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ చేసిన అందరికీ కంగ్రాట్స్. రోహిత్ గారికి నా స్పెషల్ రెస్పెక్ట్" అని బన్నీ రాసుకొచ్చాడు.

సినిమాల్లో బిల్డింగ్స్ మీద నుంచి దూకడం రిస్కా.. లేక బౌన్సర్ బాల్స్ ఆడటం రిస్కా అని శిరీష్, రోహిత్ మధ్య జరిగే సరదా సంభాషణ ఇందులో హైలైట్. సినిమా వాళ్లకు రక్షణ ఉంటుందని, తమకైతే బౌన్సర్ ఆడలేకపోతే ఇక అంతే అని రోహిత్ అంటాడు. దీంతో అతన్ని రితిక కాస్త సీరియస్ గా చూడటంతో రోహిత్ వివరణ ఇస్తుంటాడు. అక్కడితో యాడ్ ముగుస్తుంది.

ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

అటు శిరీష్ కూడా స్పందించాడు. అన్నయ్య పోస్ట్ పై, ఫ్యాన్స్ రెస్పాన్స్ పై శిరీష్ స్పందిస్తూ.. "రోహిత్ శర్మతో కలిసి పని చేయడం చాలా స్పెషల్ ఎక్స్‌పీరియన్స్. అన్నయ్య (అల్లు అర్జున్) ఎప్పుడూ నాకు సపోర్ట్ గా ఉంటారు. ఆయన మాటలు నాకు మరింత బలాన్నిచ్చాయి" అని సంతోషం వ్యక్తం చేశాడు.

అల్లు బ్రదర్స్ లేటెస్ అప్డేట్స్

అల్లు శిరీష్ ఇటీవల తన ప్రేయసి నయనికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న హైదరాబాద్‌లో ఘనంగా ఈ వేడుక జరిగింది. శిరీష్ చివరిగా ‘బడ్డీ’ సినిమాలో కనిపించాడు.

ఇక ‘పుష్ప 2’తో బాక్సాఫీస్ షేక్ చేసిన అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో దీపికా పదుకోన్ తో కలిసి ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks