Jr NTR: గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం (మే 20) తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అర్ధరాత్రే డ్రాగన్ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో వచ్చిన విషయం తెలిసిందే. అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు కూడా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్, బన్నీకి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఇద్దరూ ఆత్మీయంగా ఒకరినొకరు 'బావ' అని పిలుచుకుంటారు. అదే చనువుతో బన్నీ చేసిన స్పెషల్ ట్వీట్ నందమూరి, అల్లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
హ్యాపీ బర్త్ డే బావ
"బావా.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితం ఎప్పుడూ ఆనందం, శాంతి, సిరిసంపదలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఈసారి రాబోయేది టైగర్ కాదు.. డ్రాగన్. ప్రతి షాట్‌లోనూ నిప్పులు చెరుగుతాడు" అని అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఒక్క ట్వీట్ తో ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అవుతోంది. ముఖ్యంగా బన్నీ వాడిన 'డ్రాగన్' అనే పదం ఎక్స్ ప్లాట్ ఫామ్ లో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ గా మారింది.
డ్రాగన్‌గా వస్తున్న జూనియర్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి గ్లింప్స్ ను అర్ధరాత్రి రిలీజ్ చేశారు. చాలా రోజులుగా అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరునే ఖరారు చేశారు. నాలుగు నిమిషాలకుపైగా ఉన్న ఈ గ్లింప్స్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్ లుక్, డైలాగులు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి.
నా కలలోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు.. నా శత్రువుల ముఖాలు మాత్రమే వస్తాయి.. నా కలలో రాకుండా చూసుకో అంటూ ఎన్టీఆర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఈ గ్లింప్స్ కు హైలైట్ గా నిలిచింది. అతని కండలు తిరిగిన లుక్ కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ కేజీఎఫ్, సలార్ విజువల్సే ఈ డ్రాగన్ లోనూ కనిపిస్తున్నాయి. అంతేకాదు రవి బస్రూర్ బీజీఎం ఈ గ్లింప్స్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.
{{/usCountry}}నా కలలోకి నేను చంపిన వాళ్ల ముఖాలు రావు.. నా శత్రువుల ముఖాలు మాత్రమే వస్తాయి.. నా కలలో రాకుండా చూసుకో అంటూ ఎన్టీఆర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఈ గ్లింప్స్ కు హైలైట్ గా నిలిచింది. అతని కండలు తిరిగిన లుక్ కూడా ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ప్రశాంత్ నీల్ మార్క్ కేజీఎఫ్, సలార్ విజువల్సే ఈ డ్రాగన్ లోనూ కనిపిస్తున్నాయి. అంతేకాదు రవి బస్రూర్ బీజీఎం ఈ గ్లింప్స్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.
{{/usCountry}}డ్రాగన్ మూవీని వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేయబోతున్నారు. తాజా గ్లింప్స్ వీడియోలో టైటిల్ తోపాటు రిలీజ్ తేదీని కూడా రివీల్ చేశారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ఎన్టీఆర్ పుట్టినరోజు ఎప్పుడు?
జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టినరోజును జరుపుకుంటారు.
ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు ఎవరు?
దేవర తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా టైటిల్ ఏమిటి?
ఈ భారీ పాన్ ఇండియా మూవీకి అనుకున్నట్లుగానే డ్రాగన్ అనే టైటిల్ పెట్టారు. తాజాగా రిలీజైన గ్లింప్స్ వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.