...
...
Next Story

Allu Arjun: కొంచెం ఓపిక పట్టండి.. రాకా మూవీపై అల్లు అర్జున్ కీలక అప్‌డేట్.. ఆకాశంలో ఒక తార ఈవెంట్‌లో కామెంట్లు వైరల్

Allu Arjun: అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’. ఈ మూవీపై అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ ఇచ్చినా చాలంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అదే ప్రశ్న అల్లు అర్జున్ ను డైరెక్ట్ గా అడిగేశారు. ఆయన ఏమన్నారో ఇక్కడ చూసేయండి.

Published on: Nov 16, 2026, 05:43:24 IST
Advertisement

Allu Arjun: పుష్ప సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన అల్లు అర్జున్ చేస్తున్న నెక్స్ట్ మూవీ ‘రాకా’. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీని తమిళ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, అల్లు అర్జున్ లుక్ తో రాకాపై హైప్ భారీగా పెరిగిపోయింది.

అల్లు అర్జున్ అప్‌డేట్

కొంచెం ఓపిక పట్టండి.. రాకా మూవీపై అల్లు అర్జున్ కీలక అప్‌డేట్.. ఆకాశంలో ఒక తార ఈవెంట్‌లో కామెంట్లు వైరల్ (x/GeethaArts)
కొంచెం ఓపిక పట్టండి.. రాకా మూవీపై అల్లు అర్జున్ కీలక అప్‌డేట్.. ఆకాశంలో ఒక తార ఈవెంట్‌లో కామెంట్లు వైరల్ (x/GeethaArts)

తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఆదివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాకా మూవీ గురించి ఐకాన్ స్టార్ అప్‌డేట్ ఇచ్చారు.

లేట్ అవుతుందని తెలుసు

అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగా ఫ్యాన్స్ రాకా అని అరిచారు. దీనిపై బన్నీ రియాక్టయ్యారు. ‘‘కచ్చితంగా త్వరలో రాకా అప్‌డేట్ ఇస్తాం. నాకు తెలుసు చాలా లేట్ అవుతోంది. కానీ ఇచ్చేటప్పుడు బెస్ట్ ఇవ్వాలి. దాని గురించి డిస్కషన్ ఉండకూడదు. మేం బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాం. కొంచెం ఓపిక పట్టండి. మేం గొప్ప సినిమాను తీసుకొస్తాం’’ అని అల్లు అర్జున్ చెప్పారు.

బన్నీ మాటలతో

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రాకా'. పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఆలస్యం అవుతోందని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో బన్నీ మాటలతో వాటికి చెక్ పడింది.

మా నాన్న అలా మెచ్చుకోలేదు!

ఈ సినిమా చూసి మా నాన్న అల్లు అరవింద్ గారు చాలా ఎక్సైట్ అయ్యారు. ఆయన నా సినిమాల గురించి కూడా ఎప్పుడూ అంతలా చెప్పలేదు. ఇందులో అంత మంచి సోల్ ఉంది" అని బన్నీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆకాశంలో ఒక తార నవంబర్ 20న రిలీజ్ కానుంది. దీనికి పవన్ సాదినేని డైరెక్టర్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks