Allu Sirish Reception: మెగా వేడుకలో మెరిసిన తారలు.. గ్రాండ్ గా అల్లు శిరీష్-నయనిక రిసెప్షన్
Allu Sirish Reception: టాలీవుడ్ లో పెళ్లి సందడి సాగుతోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. ఇప్పుడు అల్లు శిరీష్, నయనిక వెడ్డింగ్ జరగబోతుంది. పెళ్లి కంటే ముందు అల్లు శిరీస్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి అటెండ్ అయిన సెలబ్రిటీల ఫొటోలు వైరల్ గా మారాయి.
సెలబ్రిటీ తారలు తరలివచ్చిన వేళ అల్లు స్టూడియోస్ వెలిగిపోయింది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్-నయనిక రెడ్డి ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ సోమవారం (మార్చి 2) రాత్రి గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కు సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి.
అల్లు అరవింద్ ఫ్యామిలీతో రామ్ చరణ్
అల్లు శిరీష్ రిసెప్షన్
అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 6న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అల్లు శిరీష్-నయనిక పెళ్లి జరగబోతుంది. అంతకంటే ముందే సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల కోసం గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ కు తెలుగు, తమిళ, కన్నడ తదితర చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
సెలబ్రిటీ గెస్ట్ లు
అల్లు శిరీష్-నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ కు భార్య అమలతో కలిసి అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, రామ్ చరణ్, నాగ చైతన్య, నాని, రానా దగ్గుబాటి, నిఖిల్, రవితేజ, గోపీచంద్, జగపతి బాబు, నవీన్ పొలిశెట్టి, మంచు లక్ష్మి, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్, డైరెక్టర్లు అట్లీ, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, కమెడియన్లు బ్రహ్మానందం, అలీ, సునీల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తదితర సెలబ్రిటీ గెస్ట్ లు అటెండ్ అయ్యారు.
అల్లు అర్జున్
తమ్ముడు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఏర్పాట్లు అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నాడు. వచ్చిన గెస్ట్ లకు వెల్ కమ్ పలకడం దగ్గర నుంచి వాళ్లతో కలిసి ఫొటోలు దిగడం వరకు అల్లు అర్జున్ అన్నీ తానై వ్యవహరించాడు. అతని భార్య స్నేహారెడ్డి అందంగా కనిపించింది.
పెళ్లి కొడుకు ఫంక్షన్
ఆదివారం (మార్చి 1) అల్లు శిరీష్ ను పెళ్లి కొడుకు చేసే వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. పద్ధతి ప్రకారం ఈ వేడుక మంగళ స్నానంతో మొదలైంది. ఈ వేడుకకు కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హాజరై సర్ ప్రైజ్ చేశారు. అల్లు శిరీష్-నయనిక కొన్నాళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. గతేడాది వీళ్ల ఎంగేజ్మెంట్ జరిగింది.
అల్లు శిరీష్ గురించి..
2013లో వచ్చిన ‘గౌరవం’ సినిమాతో అల్లు శిరీష్ డెబ్యూ చేశాడు. ఆ తర్వాత 'కొత్త జంట', 'శ్రీరస్తు శుభమస్తు', 'ఒక్క క్షణం', 'ఉర్వశివో రాక్షశివో’ తదితర సినిమాల్లో హీరోగా చేశాడు. చివరగా 2024లో వచ్చిన బడ్డీ మూవీలో అల్లు శిరీష్ కనిపించాడు.