...
...
Next Story

అన్న పెళ్లి రోజునే తమ్ముడి వివాహం.. ట్రెండ్ ఫాలో అవుతూ వెడ్డింగ్ డే అనౌన్స్ చేసిన అల్లు శిరీష్‌.. ఎప్పుడంటే?

అల్లు ఇంట పెళ్లి సందడి షురూ కాబోతుంది. అల్లు శిరీష్ పెళ్లికి టైమ్ దగ్గరపడుతోంది. తన వివాహ తేదీని ఇవాళ అల్లు శిరీష్ ట్రెండ్ ఫాలో అవుతూ అనౌన్స్ చేశాడు. తన అన్న అల్లు అర్జున్ పెళ్లి రోజునే శిరీష్ వెడ్డింగ్ జరుగుతుంది.

Published on: Dec 29, 2025, 13:31:06 IST
Advertisement

అల్లు వారి ఇంట పెళ్లి బాజా మోగబోతుంది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తన వివాహ తేదీని ఇవాళ (డిసెంబర్ 29) ఇన్ స్టాగ్రామ్ లో వీడియో ద్వారా వెల్లడించాడు శిరీష్. తన ప్రియురాలు నయనికతో ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు శిరీష్. అయితే తన పెళ్లి రోజు, అన్న అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా ఒకటే కావడం ఇక్కడ విశేషం.

అల్లు శిరీష్ పెళ్లి

అల్లు శిరీష్, నయనిక (x/Allu Sirish)
అల్లు శిరీష్, నయనిక (x/Allu Sirish)

అల్లు శిరీష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు నయనికను పెళ్లి చేసుకోబోతున్నాడు. 2025 అక్టోబర్ లో నయనిక, అల్లు శిరీష్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. సోమవారం తన పెళ్లి తేదీని వెల్లడించాడు శిరీష్. మార్చి 6, 2026న నయనిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఓ వీడియోతో ఈ అనౌన్స్ మెంట్ చేశాడు శిరీష్.

అన్న పిల్లలతో కలిసి

ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఓ వీడియో ట్రెండ్ కొనసాగుతోంది. ఇద్దరు, ఇద్దరు పక్కపక్కన నిలబడి ప్రశ్నలు వేయడం, సమాధానలు చెప్పడం, కళ్లు మూసుకుని మూమెంట్స్ చేయడం ఇందులో ఉంటుంది. అల్లు శిరీష్ కూడా అల్లు అయాన్, అర్హలతో కలిసి రీల్ చేసి పెళ్లి రోజు వెల్లడించాడు. ‘‘బాబాయ్ పెళ్లి ఎప్పుడు’’ అని అడుగుతారు పిల్లలు. మార్చి 6 అని చెప్తాడు శిరీష్. మరి సంగీత్ ఎప్పుడు? అంటే మన దక్షిణాదివాళ్లం, అలాంటివి చేసుకోమని అంటాడు శిరీష్.

అల్లు అర్జున్ మ్యారేజీ డే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మ్యారేజీ డే కూడా మార్చి 6నే కావడం విశేషం. అల్లు అర్జున్, స్నేహారెడ్డి వెడ్డింగ్ 2011లో మార్చి 6న జరిగింది. ఇప్పుడు అల్లు శిరీష్, నయనికల పెళ్లి 2026 మార్చి 6న జరుగుతుంది.

శిరీష్ లవ్ స్టోరీ

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks