టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నయనిక రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు అల్లు శిరీష్. అయితే ఆ పెళ్లి వేడుకల కంటే, అల్లు శిరీష్ ధరించిన ఆభరణాలే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
విభిన్నమైన నెక్లెస్‌లు

నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకు అల్లు శిరీష్ విభిన్నమైన నెక్లెస్‌లు (నగలు), చోకర్లు ధరించడంపై నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో ట్రోల్ చేశారు. తాజాగా ఈ విషయంపై శిరీష్ స్పందిస్తూ.. ఫ్యాషన్ విషయంలో తనకున్న స్పష్టతను, ధైర్యాన్ని చాటుకున్నారు.
"ఏది మగతనమో నేనే నిర్ణయించుకుంటా"
తన ఫ్యాషన్ సెన్స్‌పై వస్తున్న విమర్శలను అల్లు శిరీష్ ఏమాత్రం పట్టించుకోలేదు. "ఏది మగతనం? ఏది ఆడతనం? అని ఇతరులు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా గురించి నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఏం ధరించాలి అనేది నేనే నిర్ణయించుకుంటాను" అని అల్లు శిరీష్ ఖరాకండిగా చెప్పారు. మగవారికి బట్టల విషయంలో పెద్దగా ప్రయోగాలు చేసే అవకాశం ఉండదని, అందుకే యాక్సెసరీస్‌తో తనదైన స్టైల్‌ను చాటుకున్నానని వివరించారు.
జెండర్ నిబంధనలు మనమే మార్చుకోవాలి
"అబ్బాయిలు అంటే నీలం రంగు, అమ్మాయిలు అంటే పింక్ అని ఫిక్స్ అయిపోవడం ఈ కాలంలో పుట్టుకొచ్చిన పద్ధతి. ప్రాచీన కాలంలో మన రాజులు, మహారాజులు కూడా భారీ ఆభరణాలు ధరించేవారు. వంద ఏళ్ల క్రితం వరకు పర్ఫ్యూమ్స్‌లో కూడా ఆడ, మగ అనే తేడాలు ఉండేవి కావు. ఎవరో ఒకరు మొదలుపెడితేనే కదా మార్పు వస్తుంది. ట్రోల్స్ వస్తాయని తెలిసినా, ఆ పాతకాలపు ఆలోచనలను బ్రేక్ చేయాలనే నేను ఇలా సిద్ధమయ్యాను" అని అల్లు శిరీష్ ట్రోల్ర్స్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.
కుటుంబ సభ్యులను ఒప్పించడం సవాలుగా మారింది!
తన పెళ్లి డ్రెస్సింగ్‌పై ఇంట్లో వారు కూడా మొదట సందేహించారని అల్లు శిరీష్ సరదాగా పంచుకున్నారు. "నెక్లెస్‌లు వేసుకోవడం ఇప్పుడు అవసరమా? అని వాళ్లు అడిగారు. అప్పుడు నేను.. 'ఎహే ఊరుకోండి.. మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరూ చేయరు. ఇలాగే వదిలేస్తే ఇంకో ఇరవై ఏళ్లయినా పరిస్థితులు మారవు' అని వాళ్లను ఒప్పించాను" అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.
మీమ్స్ రాయుళ్లకు క్లాస్..
{{/usCountry}}తన పెళ్లి డ్రెస్సింగ్‌పై ఇంట్లో వారు కూడా మొదట సందేహించారని అల్లు శిరీష్ సరదాగా పంచుకున్నారు. "నెక్లెస్‌లు వేసుకోవడం ఇప్పుడు అవసరమా? అని వాళ్లు అడిగారు. అప్పుడు నేను.. 'ఎహే ఊరుకోండి.. మనం కూడా ట్రై చేయకపోతే ఇంకెవరూ చేయరు. ఇలాగే వదిలేస్తే ఇంకో ఇరవై ఏళ్లయినా పరిస్థితులు మారవు' అని వాళ్లను ఒప్పించాను" అని అల్లు శిరీష్ చెప్పుకొచ్చారు.
మీమ్స్ రాయుళ్లకు క్లాస్..
{{/usCountry}}అల్లు శిరీష్ నిశ్చితార్థం సమయంలో ధరించిన చోకర్‌పై వచ్చిన ఓ మీమ్‌కు ఆయన గతంలోనే అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు. "పెళ్లికి వడ్డాణం కూడా పెట్టుకుంటాడేమో" అని జోక్ చేసిన వారికి.. "మన తెలుగు మీమర్స్ చాలా ఫన్నీగా ఉంటారు. వడ్డాణం కేవలం మహిళలు మాత్రమే ధరిస్తారు, కానీ చోకర్లు మన భారతీయ మహారాజులు, మొఘల్ చక్రవర్తులు కూడా వాడేవారు. చోకర్లు కేవలం మహిళలకే అనేది పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఆలోచన మాత్రమే" అని చరిత్రను గుర్తు చేశారు
అంగరంగ వైభవంగా పెళ్లి
మార్చి 6న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో అల్లు శిరీష్ తన ఆచారాలకు, ట్రెండీ ఫ్యాషన్‌కు సమ ప్రాధాన్యత ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పెళ్లి వేడుకలన్నింటిని తన అన్నయ్య అల్లు అర్జున్ చూసుకున్నారని ఇదివరకు అల్లు శిరీష్ చెప్పారు.