OTT Crime Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఉత్కంఠగా టీజర్.. డెడ్లీ స్కామ్

OTT Crime Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రొడ్యూసర్ గా మారి ఈ సిరీస్ ను తెరకెక్కించడం విశేషం. తాజాగా రిలీజైన టీజర్ ఉత్కంఠగా సాగింది.

Published on: Mar 19, 2026, 14:39:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ కొత్త వెబ్ సిరీస్ పేరు 'స్టార్మ్' (Storm). అయితే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ మీద ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గురువారం (మార్చి 19) ప్రైమ్ వీడియో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను ఎక్స్ లో షేర్ చేసింది.

OTT Crime Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఉత్కంఠగా టీజర్.. డెడ్లీ స్కామ్
OTT Crime Thriller Web Series: ప్రైమ్ వీడియోలోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఉత్కంఠగా టీజర్.. డెడ్లీ స్కామ్

'స్టార్మ్' వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే..

హృతిక్ రోషన్ ప్రొడ్యూసర్ గా మారి నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టార్మ్.. ఐదుగురు మహిళల చుట్టూ తిరిగే ఒక పవర్‌ఫుల్ కథ. వాళ్లందరికీ ఎవరి బాధలు వాళ్లకు ఉన్నాయి. అలాగే ఎన్నో కలలు, ఎవరికీ తెలియని కొన్ని భయంకరమైన సీక్రెట్స్ కూడా ఉన్నాయి.

ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ పేరుతో మొదలైన ఒక స్కీమ్.. అనుకోకుండా ఒక డెడ్లీ స్కామ్ గా మారుతుంది. ఈ మోసాల వలయంలో ఆ ఐదుగురు మహిళలు ఎలా ఇరుక్కున్నారు? ఆ స్కామ్ వాళ్లను నాశనం చేసిందా లేక వాళ్లకు అక్కడి నుంచి స్వేచ్ఛను ఇచ్చిందా? అనేది ఈ సిరీస్ మెయిన్ ప్లాట్.

స్టార్మ్ వెబ్ సిరీస్ నటీనటులు

ప్రైమ్ వీడియో తమ పోస్ట్‌లో వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. ఫిల్మ్‌క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ లో ఒక డివిజన్ అయిన 'హెచ్ఆర్ఎక్స్ ఫిల్మ్స్' (HRX Films) బ్యానర్‌పై దీన్ని నిర్మిస్తున్నారు.

స్టార్ హీరో హృతిక్ రోషన్, ఇషాన్ రోషన్ కలిసి ఈ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. అజిత్‌పాల్ సింగ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. అంతేకాదు అతడే.. ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ తో కలిసి స్టోరీ అందించాడు.

ఇక ఈ స్టార్మ్ వెబ్ సిరీస్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ పార్వతి తిరువోతు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ, సబా ఆజాద్ (హృతిక్ రోషన్ రియల్ లైఫ్ పార్ట్‌నర్) మెయిన్ లీడ్స్‌గా చేస్తున్నారు. వీళ్లతో పాటు సువీందర్ పాల్ విక్కీ, టాలెంటెడ్ సీనియర్ యాక్టర్స్ ఆశిష్ విద్యార్థి, రజత్ కపూర్, అశోక్ పాఠక్, గౌతమ్ రోడే, ప్రియాంక సేథియా, రంజన్ రాజ్ లాంటి భారీ కాస్ట్ అంతా ఇందులో ఉన్నారు.

ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రైమ్ వీడియో ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే రానుందని మాత్రం చెప్పింది. ఈ సిరీస్ తర్వాత ప్రైమ్ వీడియోతోనే హృతిక్ రోషన్.. మెస్ అనే మరో మూవీ చేస్తున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేశాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More