Ameesha Patel Regrets Of Bhumika Role: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రాల్లో 'తేరే నామ్' ఒకటి. 2003లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. రాధే పాత్రలో సల్మాన్ ఖాన్ నటన, ఆ హెయిర్ స్టైల్, హిట్ సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే.
తొలి హిందీ సినిమా

అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భూమిక చావ్లాకు అది తొలి హిందీ సినిమా. కానీ, నిజానికి ఈ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ మొదట అనుకున్నది భూమికను కాదు. అప్పట్లో స్టార్ ఇమేజ్‌తో తెగ క్రేజ్‌లో ఉన్న అమీషా పటేల్‌ను. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమీషా పటేల్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఆఫర్ వచ్చినప్పుడు ఏమైందంటే?
అమీషా పటేల్ మాట్లాడుతూ.. "తేరే నామ్ సినిమాను మిస్ చేసుకోవడం నా కెరీర్‌లో ఒక పెద్ద వెలితి. సల్మాన్ నాకు కథ చెప్పినప్పుడు కేవలం పాటలు మాత్రమే రికార్డ్ అయ్యాయి. సినిమా గురించి ఒక స్పష్టమైన ఐడియా ఉంది కానీ, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయాలపై అప్పట్లో స్పష్టత లేదు. అంతా గాల్లో దీపంలా ఉన్న సమయంలో సల్మాన్ నాకు కథ వినిపించి, పాటలు కూడా వినిపించారు. నాకు కథ బాగా నచ్చింది, కానీ డేట్స్ ఖరారు కాలేదు" అని వివరించారు.
సతీష్ కౌశిక్ ఎంట్రీ ఇచ్చేసరికి ఆలస్యం
సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కేటప్పుడు దర్శకుడు, షెడ్యూల్స్ ముందే సిద్ధంగా ఉంటాయి. కానీ, 'తేరే నామ్' విషయంలో అది జరగలేదు. దర్శకుడిగా దివంగత సతీష్ కౌశిక్ పేరు ఖరారయ్యే సరికి చాలా సమయం పట్టింది. అప్పటికే అమీషా పటేల్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు.
{{/usCountry}}సాధారణంగా పెద్ద ప్రాజెక్టులు పట్టాలెక్కేటప్పుడు దర్శకుడు, షెడ్యూల్స్ ముందే సిద్ధంగా ఉంటాయి. కానీ, 'తేరే నామ్' విషయంలో అది జరగలేదు. దర్శకుడిగా దివంగత సతీష్ కౌశిక్ పేరు ఖరారయ్యే సరికి చాలా సమయం పట్టింది. అప్పటికే అమీషా పటేల్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల తన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారు.
{{/usCountry}}"సల్మాన్ ఖాన్ పూర్తి ప్లానింగ్‌తో వచ్చి ఉంటే కచ్చితంగా ఆ సినిమా చేసేదాన్ని. నేను అప్పటికే ఇతర నిర్మాతలకు మాట ఇచ్చి ఉండటం వల్ల వెనక్కి తగ్గాల్సి వచ్చింది" అని అమీషా పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమిళ రీమేక్‌గా వచ్చి సంచలనం
'తేరే నామ్' చిత్రం 1999లో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా వచ్చిన తమిళ సూపర్ హిట్ 'సేతు'కు రీమేక్. ఒక మొండి ఘటం, కాలేజ్ డ్రాపవుట్ అయిన యువకుడు ఒక అమాయకపు అమ్మాయి ప్రేమలో పడి, చివరికి పిచ్చోడిగా మారే ఈ విషాద గాథ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
భూమిక చావ్లా ఈ పాత్రలో ఒదిగిపోయి నటించడంతో ఆమెకు బాలీవుడ్‌లో మంచి బ్రేక్ లభించింది. అమీషా పటేల్ వంటి స్టార్ హీరోయిన్ నటించి ఉంటే ఫలితం ఎలా ఉండేదో కానీ, ఇప్పటికీ 'తేరే నామ్' అంటే సల్మాన్-భూమిక జోడీనే అందరికీ గుర్తొస్తుంది. అలా అమీషా పటేల్ ప్లేసులోకి భూమిక వచ్చి మంచి క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగులో రాజశేఖర్ హీరోగా
కాగా, ఇదే సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. ఆ సినిమానే శేషు. ఈ మూవీలో హీరోగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ చేయగా.. హీరోయిన్‌గా కావేరి చేసింది. అయితే, ఈ సినిమాకు రాజశేఖర్ భార్య జీవిత దర్శకత్వం వహించడం విశేషం. రాజశేఖర్ నటనకు ప్రశంసలు వచ్చిన శేషు సినిమా తెలుగులో మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. తేరే నామ్ సినిమా ఏ చిత్రానికి రీమేక్?
తేరే నామ్ చిత్రం 1999లో విడుదలైన తమిళ సినిమా 'సేతు'కు అధికారిక రీమేక్. తమిళంలో విక్రమ్ హీరోగా నటించారు.
2. అమీషా పటేల్ ఈ సినిమాను ఎందుకు వదులుకున్నారు?
సినిమా షూటింగ్ డేట్స్ మరియు దర్శకుడు సతీష్ కౌశిక్ రాక ఆలస్యం కావడంతో, అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న అమీషా పటేల్ తన డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజెక్టును వదులుకున్నారు.
3. తేరే నామ్ సినిమా ఎప్పుడు విడుదలైంది?
ఈ చిత్రం 2003లో థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.