...
...
Next Story

Amitabh Bachchan: కాల్పులు, బాంబు బెదిరింపులు..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌..సండే ద‌ర్శ‌న్ వీడియోలు వైరల్

Amitabh Bachchan: బాలీవుడ్ స్టార్స్‌కు వరుస బెదిరింపులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏకంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడంతో ఆయన పటిష్ట భద్రత మధ్య బుల్లెట్ ప్రూఫ్ గాజులో నుంచి దర్శనమిచ్చారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

Published on: Nov 2, 2026, 11:28:29 IST
Advertisement

Amitabh Bachchan: ముంబైలోని తన బంగ్లా 'జల్సా' బయట ప్రతి ఆదివారం అభిమానులను పలకరించడం అమితాబ్ బచ్చన్‌కు దశాబ్దాలుగా ఉన్న అలవాటు. కానీ ఈ వారం అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. ఆయన నేరుగా కాకుండా ఒక ట్రాన్స్ పరెంట్ గ్లాస్ బాక్స్ లోపలి నుంచి అభిమానులకు అభివాదం చేశారు.

బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ బాక్స్

కాల్పులు, బాంబు బెదిరింపులు..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌..సండే ద‌ర్శ‌న్ వీడియోలు వైరల్
కాల్పులు, బాంబు బెదిరింపులు..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌..సండే ద‌ర్శ‌న్ వీడియోలు వైరల్

ఈ సండే (నవంబర్ 1) తన ఫ్యాన్స్ ను అమితాబ్ బచ్చన్ ఎప్పటిలాగే పలకరించారు. కానీ ఈ సారి ఆయన బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ బాక్స్ లోపల ఉన్నారు. ఈ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తండ్రికి రక్షణగా అభిషేక్ బచ్చన్ కూడా ఆయన వెంటే ఉండి, జనాలపై ఓ కన్నేసి ఉంచారు. చుట్టుపక్కల భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరించారు.

కలకలం రేపిన బాంబు బెదిరింపు

అమితాబ్‌కు అకస్మాత్తుగా ఇంతటి కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి ప్రధాన కారణం ఇటీవల వచ్చిన ఒక బాంబు బెదిరింపు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ ప్రాంతంలోని ఒక పాఠశాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ వచ్చింది. అందులో అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామని బెదిరించడంతో ముంబై పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు.

సోషల్ మీడియాకు దూరం

ఒకవైపు భద్రతా సమస్యలు ఉండగానే, బిగ్ బి ఆరోగ్య పరిస్థితి కూడా అభిమానులను కలవరపెడుతోంది. వైద్యుల సలహా మేరకు తాను పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నానని అమితాబ్ తెలిపారు. కొద్ది రోజుల పాటు ఎక్స్ (ట్విట్టర్), బ్లాగ్ వంటి సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని, ప్రస్తుతం తాను ఏమీ రాయలేని స్థితిలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

బాలీవుడ్‌ను వణికిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు ఎంతలా పెరిగిపోయాయంటే, తాజాగా అక్టోబర్ 18న ముంబైలోని జుహూ ప్రాంతంలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ కారుపై షూటర్లు ఏకంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అతను ఫుట్‌బాల్ ఆడుకుని వస్తుండగా ఈ ఎటాక్ జరిగింది. అదృష్టవశాత్తూ టైగర్ ష్రాఫ్ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకోగా, ఆయన డ్రైవర్‌కు, అక్కడ ఉన్న మరో వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.

పోలీసుల దర్యాప్తులో ఈ కాల్పులు జరిపింది బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులేనని తేలింది. వీరు టైగర్ ష్రాఫ్ కంటే ముందు ఆమిర్ ఖాన్ ఇంటి వద్ద కూడా రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వరుస ఘటనలతో ముంబై పోలీసులు బాలీవుడ్ స్టార్స్‌కు భద్రతను అమాంతం పెంచేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks