టాలీవుడ్ ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ, ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న పెళ్లి పీటలెక్కారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నడుస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని విజయ్ తమ్ముడు, నటుడు ఆనంద్ దేవరకొండ కొత్త జంట ఫోటోను షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
‘వదిన.. ఎలా ఉన్నారు?’ అని అడిగేవారు

తన పోస్ట్‌లో ఆనంద్ దేవరకొండ గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. “గతంలో చాలా సందర్భాల్లో అభిమానులు నన్ను కలిసినప్పుడు ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడిగేవారు. అప్పట్లో ఆ ప్రశ్నకు ఎలా స్పందించాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు నా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత సానుకూల దృక్పథం, కరుణ కలిగిన వ్యక్తి నాకు వదినగా రావడం చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ జీవితాంతం ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. వెల్‌కమ్ టు ది ఫ్యామిలీ వదిన” అంటూ ఆనంద్ ఎమోషనల్ అయ్యాడు.
సంప్రదాయబద్ధంగా వివాహ వేడుక
ఉదయ్‌పూర్‌లోని లగ్జరీ రిసార్ట్ ‘ఐటీసీ గ్రాండ్ భారత్’ రిసార్ట్ లో విజయ్, రష్మిక వివాహం జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రెండు రాష్ట్రాల (తెలంగాణ, కర్ణాటక) సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. ఉదయాన్నే గణేష్ పూజ, తెలుగు వారి అంగవస్త్రం ధరించే ఆచారంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత రష్మిక కుటుంబ సంప్రదాయం ప్రకారం ‘కొడవ’ రీతిలో కూడా కొన్ని క్రతువులు నిర్వహించారు.
పెళ్లి మండపంలో విజయ్ ఐవరీ సిల్క్ వేష్టి, అంగవస్త్రంలో మెరిసిపోగా.. రష్మిక కాంచీవరం పట్టుచీరలో ధగధగలాడిపోయింది. బంతిపూలు, మల్లెపూల అలంకరణ మధ్య ఈ జంట మంగళసూత్ర ధారణతో ఒకటయ్యారు.
నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా భార్య: విజయ్ దేవరకొండ
{{/usCountry}}పెళ్లి మండపంలో విజయ్ ఐవరీ సిల్క్ వేష్టి, అంగవస్త్రంలో మెరిసిపోగా.. రష్మిక కాంచీవరం పట్టుచీరలో ధగధగలాడిపోయింది. బంతిపూలు, మల్లెపూల అలంకరణ మధ్య ఈ జంట మంగళసూత్ర ధారణతో ఒకటయ్యారు.
నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు నా భార్య: విజయ్ దేవరకొండ
{{/usCountry}}పెళ్లి తర్వాత రష్మిక తన ఆనందాన్ని పంచుకుంటూ.. “విజయ్ నాకు నిజమైన ప్రేమ అంటే ఏంటో నేర్పించారు. నేను అనుకున్న స్థాయికి చేరడానికి నిరంతరం అండగా నిలిచారు. నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది” అని పేర్కొంది.
మరోవైపు విజయ్ స్పందిస్తూ.. “నా రోజువారీ జీవితంలో, వర్కవుట్స్‌లో, భోజన సమయంలో.. ఇలా ప్రతిక్షణం రష్మిక లేని లోటు నాకు తెలిసేది. తన రాకతో నా జీవితంలో ప్రశాంతత నెలకొంది. నా బెస్ట్ ఫ్రెండ్‌ను భార్యగా పొందడం నా అదృష్టం” అంటూ తన ప్రేమను చాటుకున్నాడు.