...
...
Next Story

చెదిరిన ముంగురులు.. మత్తెక్కే నడక.. అనసూయ తగ్గేదేలే.. చీరలో అదిరే హాట్ షో.. వైరల్ ఫొటోలు

ఓ వైపు ట్రోల్స్ వచ్చినా.. తన పని తాను చేసుకుంటూ, నెగెటివిటీ పట్టించుకోకుండా సాగిపోతోంది అనసూయ. లేటెస్ట్ గా హాట్ షోతో రెచ్చిపోయింది. చీరలో ఆమె అందాల పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Published on: Dec 15, 2025, 12:28:00 IST
Advertisement

ఒకప్పుడు జబర్దస్త్ యాంకర్ గా ఊపు ఊపిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీగా మారిపోయింది. కీ రోల్స్ చేస్తూ నటనలో తనదైన ముద్ర వేస్తోంది. మరోవైైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ట్రోల్స్ ను పట్టించుకోకుండా తనదైన స్టైల్లో హాట్ పోజులు పోస్టు చేసింది అనసూయ. చీరలో అనసూయ అందాలు తెగ వైరల్ గా మారాయి. ఆమె ఫొటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

అనసూయ అందాలు

అనసూయ (instagram)
అనసూయ (instagram)

అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తన సోషల్ మీడియా అకౌంట్లలో ఆమె పోస్టులకు అదిరే రీచ్ ఉంటుంది. ఇవాళ (డిసెంబర్ 15) తన ఇన్ స్టాగ్రామ్ లో అనసూయ పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ గా మారాయి. చీరలో అనసూయ అందాల ప్రదర్శనే అందుకు కారణం. వయ్యారంగా చీర కట్టుకున్న ఈ భామ, కుర్చీలో కూర్చుని హాట్ పోజులిచ్చింది.

హిందీ కొటేషన్

హిందీ కొటేషన్ తో అనసూయ తన ఇన్ స్టాగ్రాలో సోమవారం హాట్ పిక్స్ పోస్టు చేసింది. ‘‘చెదిరిపోయిన జుట్టు,మత్తెక్కించే నడక’’ అనే అర్థం వచ్చేలా ఈ ఫోటోలను పోస్టు చేసింది అనసూయ. ఇవి ఇన్ స్టాగ్రామ్ లో, ఇంటర్నెట్ లో ఇన్ స్టంట్ వైరల్ గా మారాయి. కుందనపు బొమ్మ, లవ్ లీ హెయిర్, క్యూట్ స్మైల్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఫ్యామిలీ ట్రిప్

2003లో సినిమాల్లో అడుగుపెట్టిన అనసూయ తర్వాత అవకాశాలు రాక బుల్లితెరపై సత్తాచాటింది. 2018లో వచ్చిన రంగస్థలంతో ఆమె కెరీర్ టర్న్ అయింది. ఆ సినిమాలోని రంగమ్మత్త పాత్ర ఆమె దశనే మార్చేసింది. మళ్లీ పుష్పలోని దాక్షాయణితో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.

హరి హరి వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అనసూయ చివరగా అరి మూవీలో కనిపించింది. ఇప్పుడు తమిళంలో ఫ్లాష్ బ్యాక్, వోల్ఫ్ అనే సినిమాలు చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks