...
...
Next Story

శివాజీతో గొడవ-అనసూయ తగ్గేదేలే-బికినీలో హాట్ షో-భర్త కిస్-న్యూ ఇయర్ ట్రీట్-భయపడేదే లేదంటూ!

అనసూయ తగ్గేదేలే. ఎవరేం అనుకున్నా? ఎవరేం చేసినా? తన లైఫ్ తన ఇష్టం అన్నట్లు ఈ నటి, యాంకర్ దూసుకెళ్తోంది. తాజాగా న్యూ ఇయర్ 2026 సందర్భంగా బికినీ ఫొటోలను ఇన్ స్టాలో పోస్టు చేసింది. శివాజీతో గొడవ నేపథ్యంలో ఇవి తెగ వైరల్ గా మారాయి.

Published on: Jan 1, 2026, 12:11:09 IST
Advertisement

ఒకప్పటి యాంకర్, నటి అనసూయ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. బికినీలో బోల్డ్ పోజులిచ్చింది. న్యూ ఇయర్ 2026 సందర్భంగా ఇవాళ (జనవరి 1) ఇన్ స్టాగ్రామ్ లో అనసూయ పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. శివాజీతో గొడవ నేపథ్యంలో అనసూయ తగ్గేదేలే అన్నట్లుగా సాగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనసూయ హాట్ షో

అనసూయ (instagram-itsme_anasuya)
అనసూయ (instagram-itsme_anasuya)

న్యూ ఇయర్ 2026 వచ్చేసింది. ఈ ఏడాది ఫస్ట్ రోజే అనసూయ హాట్ షోతో అదరగొట్టింది. వెకేషన్లో బికినీలో ఉన్న పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. భర్తతో కలిసి న్యూ ఇయర్ పార్టీని అనసూయ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో ఒకదాంట్లో భర్త భరద్వాజ్ అనసూయకు ముద్దు పెడుతున్నాడు.

భయపడేదే లేదు

‘‘అదే మహిళా. అదే స్పైన్. గ్రోత్, ప్రశాంతత, నాన్సెన్స్ పట్ల సున్నా ఉపేక్ష కొనసాగాలని అనుకుంటూ న్యూ ఇయర్ లో అడుగుపెడుతున్నా. నాకు ఇష్టమైనవి చేస్తా. ఎలాంటి గిల్ట్ లేకుండా తింటా. లిమిట్స్ లేకుండా ప్రయాణిస్తా. భయమన్నదే లేకుండా మాట్లాడతా. లౌడ్ గా జీవిస్తా. ఎక్కువగా ప్రేమిస్తా. ఈ న్యూ ఇయర్ లో షైన్ అవుతా. నాయిస్ కంటే కూడా మీ ధైర్యం ఎక్కువగా ఉండాలి. అందరికీ హ్యాపీ 2026’’ అని హాట్ ఫొటోలు పోస్టు చేసింది అనసూయ.

శివాజీతో గొడవ

మీరెందుకు మధ్యలో వస్తున్నారంటూ శివాజీ కౌంటర్ ఇచ్చాడు. మీ రుణం తీర్చుకునే అవకాశం దక్కాలని కోరుకుంటున్నానని కూడా అన్నాడు. దీనిపై అనసూయ మరింగ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. మీలాంటి వాళ్ల సాయం అవసరం లేదని, ఇదే మీ నిజ స్వరూపమని, నేనూ హీరోయిన్ నే అంటూ లైవ్ వీడియోలో పేర్కొంది. మరోవైపు తన వ్యాఖ్యలకు శివాజీ క్షమాపణ చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks