ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతం, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమెపై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బీజేపీ నాయకులు తమ ఫిర్యాదులో అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం ముసుగులో కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారంటూ అనసూయ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదని, మాట్లాడేటప్పుడు చూసుకోవాలని హెచ్చరించారు. మతపరమైన భావాలను గాయపరిచినందున ఆమెపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసి అనసూయ తన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు.
కొందరు కావాలనే తన మాటలను సగం సగం ఎడిట్ చేసి వక్రీకరిస్తున్నారని, లేని అర్థాలను తీస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనసూయ ఆరోపించారు. తాను ఏ మతాన్ని, ఏ కులాన్ని లేదా ఏ సమూహాన్ని ఉద్దేశించి ఆ మాటలు అనలేదని స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత దాడులు, వేధింపులకు పాల్పడుతున్న కొందరు వ్యక్తుల వైఖరిని మాత్రమే ప్రశ్నించానని తెలిపారు.
తాను కూడా సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, ఆంజనేయ స్వామి భక్తురాలినని అనసూయ చెప్పారు. ఆ అనామకుల ప్రవర్తనపై తాను ప్రశ్నిస్తే, ఈ వివాదంతో అసలైన దొంగలంతా బయటకు వస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. తన వివరణ ముగింపులో జై శ్రీరామ్, జై హనుమాన్ అని పేర్కొంటూ పోస్ట్ ముగించారు.
{{/usCountry}}తాను కూడా సనాతన ధర్మాన్ని పాటించే హిందువునని, ఆంజనేయ స్వామి భక్తురాలినని అనసూయ చెప్పారు. ఆ అనామకుల ప్రవర్తనపై తాను ప్రశ్నిస్తే, ఈ వివాదంతో అసలైన దొంగలంతా బయటకు వస్తున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. తన వివరణ ముగింపులో జై శ్రీరామ్, జై హనుమాన్ అని పేర్కొంటూ పోస్ట్ ముగించారు.
{{/usCountry}}బీజేపీ నాయకుల ఫిర్యాదును స్వీకరించిన బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో క్లిప్‌లు, లీగల్ అంశాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.