ఆంధ్ర కింగ్ తాలూకా.. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ఇది. ఈ సినిమాపై రామ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ మార్చారు. ఒక రోజు ముందే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి రామ్ పోతినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.
ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ డేట్

రామ్ పోతినేని అప్ కమింగ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దీనికి మహేష్ బాబు.పి డైరెక్టర్. ఈ సినిమాను మొదట నవంబర్ 28న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మార్చారు. ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ 27న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
‘‘ఒక రోజు ముందుగానే కంటెంట్ ఇవ్వబోతున్న మహేష్ కు ధన్యవాదాలు. థ్యాంక్స్ గివింగ్ రోజు ఆంధ్ర కింగ్ తాలూకా మీ దగ్గరకు రాబోతుంది’’ అని రామ్ పోతినేని ఎక్స్ లో పోస్టు చేశాడు.
ట్రైలర్ ఆ రోజే
ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ఇవాళ (నవంబర్ 16) అనౌన్స్ చేశారు. నవంబర్ 18న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘‘ఇదే టైమ్. సాగర్ లైఫ్ స్టోరీని త్వరలోనే చూసేందుకు రెడీగా ఉండండి. ఓ ఫ్యాన్ బయోపిక్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ నవంబర్ 18న రాబోతుంది’’ అని రామ్ పోతినేని ఎక్స్ లో పోస్టు చేశాడు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తో పాటు స్పెషల్ డ్రోన్ షోను నవంబర్ 18న సాయంత్రం 5 గంటల నుంచి కర్నూల్ లోని ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఫ్యాన్ బయోపిక్
{{/usCountry}}ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ఇవాళ (నవంబర్ 16) అనౌన్స్ చేశారు. నవంబర్ 18న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘‘ఇదే టైమ్. సాగర్ లైఫ్ స్టోరీని త్వరలోనే చూసేందుకు రెడీగా ఉండండి. ఓ ఫ్యాన్ బయోపిక్ అయిన ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ నవంబర్ 18న రాబోతుంది’’ అని రామ్ పోతినేని ఎక్స్ లో పోస్టు చేశాడు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తో పాటు స్పెషల్ డ్రోన్ షోను నవంబర్ 18న సాయంత్రం 5 గంటల నుంచి కర్నూల్ లోని ఔట్ డోర్ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఫ్యాన్ బయోపిక్
{{/usCountry}}ఓ హీరోను పిచ్చిగా అభిమానించే ఫ్యాన్ బయోపిక్ గా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రాబోతుంది. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆంధ్ర కింగ్ సూర్య క్యారెక్టర్ ను ఆయన పోషిస్తున్నారు. ఇందులో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, రిలీజైన పాటలు ఇప్పటికే మూవీపై హైప్ పెంచేశాయి. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్నారు.