రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ తెలుగు సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓ సినిమా ఫ్యాన్ బయోపిక్ గా వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం గొప్పగా రాబట్టలేకపోయింది.
ఆంధ్ర కింగ్ తాలూకా ఓటీటీ

రీసెంట్ టైమ్స్ లో తెలుగులో మంచి హిట్ అనిపించుకున్న సినిమాల్లో ఆంధ్రా కింగ్ తాలూకా ఒకటి. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ప్రతి ఫ్యాన్ కూడా ఇది తన బయోపిక్ అనుకునేలా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇవాళ (డిసెంబర్ 20) అనౌన్స్ చేసింది.
అయిదు భాషల్లో
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ అయిదు భాషల్లో ఓటీటీలో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఇది డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ పి.మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న థియేటర్లలో రిలీజైంది. ఇందులో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేతో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా కీలక పాత్ర పోషించాడు. వీళ్లతో పాటు రాహుల్ రవీంద్రన్, రావు రమేశ్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.
ఆంధ్ర కింగ్ తాలూకా కథ
సాధారణంగా సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. ఇందులో కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఓ ఫ్యాన్ కథనే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా. ఇందులో సూర్య (ఉపేంద్ర) ఓ సూపర్ స్టార్ హీరో. అతణ్ని ఆంధ్రా కింగ్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. అతనికి సాగర్ (రామ్) వీరాభిమాని. సూర్య సినిమా అంటే చాలు చొక్కా చింపుకునేంత అభిమానం.
{{/usCountry}}సాధారణంగా సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. ఇందులో కొంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఓ ఫ్యాన్ కథనే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా. ఇందులో సూర్య (ఉపేంద్ర) ఓ సూపర్ స్టార్ హీరో. అతణ్ని ఆంధ్రా కింగ్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. అతనికి సాగర్ (రామ్) వీరాభిమాని. సూర్య సినిమా అంటే చాలు చొక్కా చింపుకునేంత అభిమానం.
{{/usCountry}}అయితే సూర్య వందో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు సూర్యకు రూ.3 కోట్ల సాయం కావాల్సి వస్తుంది. ఆ సమయంలోనే సాగర్ తన హీరో సూర్య కోసం రూ.3 కోట్లు పంపిస్తాడు. సూర్యకు అంత డబ్బు ఎందుకు అవసరం వచ్చింది? సాగర్ ఏ త్యాగం చేశాడు? అనేది సినిమాలో చూడాల్సిందే.