హీరోకు 3 కోట్ల సాయం చేసే ఫ్యాన్ కథ.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా.. రామ్ మూవీని ఇక్కడ చూసేయండి

రామ్ పోతినేని లేటేస్ట్ హిట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీలోకి వచ్చేసింది. తాను ఆరాధించే హీరోకు రూ.3 కోట్లు సాయం చేసే ఫ్యాన్ కథతో తెరకెక్కిిన సినిమా ఇది. ఇందులో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. 

Published on: Dec 25, 2025, 06:16:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వరుస ఫ్లాప్ ల తర్వాత కాస్త రూట్ మార్చి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ చేశాడు రామ్ పోతినేని. అదే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమా. ఈ చిత్రంలో ఓ హీరో అంటే పిచ్చి అభిమానమున్న ఫ్యాన్ గా నటించాడు రామ్. ఈ మూవీ ఇవాళ (డిసెంబర్ 25) ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో రామ్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది.

ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలూకా (x/ramsayz)
ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలూకా (x/ramsayz)

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీలో అందుబాటులో ఉంది.

పాజిటివ్ రెస్పాన్స్.. కానీ

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి హీరో ఫ్యాన్ చూడాల్సిన సినిమా అని రివ్యూలు చెప్పాయి. కానీ కలెక్షన్లు మాత్రం అంతంతమాత్రంగానే వచ్చాయి. రామ్ పోతినేని హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా నవంబర్ 27న రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకున్నా చివరకు దాదాపు రూ.35 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టగలిగింది. ఈ సినిమాకు మహేష్ బాబు.పి డైెరెక్టర్.

రాంగ్ టైమింగ్

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా బాగుంది. స్టోరీ బాగుంది. ఇందులో రామ్ పోతినేని యాక్టింగ్ బాగుంది. కానీ మూవీ రిలీజ్ టైమింగ్ మాత్రమే రాంగ్ గా ఉంది. సాధారణంగా నవంబర్ ను మూవీ రిలీజ్ ల పరంగా అన్ సీజన్ అంటుంటారు. కానీ మూవీపై నమ్మకంతో ధైర్యం చేసి ఆంధ్రా కింగ్ తాలూకా మేకర్స్ రిలీజ్ చేశారు. అందుకే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా జనాలను థియేటర్లకు రప్పించలేకపోయింది.

ఆంధ్రా కింగ్ తాలూకా స్టోరీ

సూర్య కుమార్ (ఉపేంద్ర) ఓ పాపులర్ హీరో. వరుసగా సూపర్ హిట్ సినిమాలతో ఆంధ్రా కింగ్ అనిపించుకుంటాడు. అతను వందో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. కానీ మధ్యలోనే బ్రేక్ పడుతుంది. మరోవైపు సాగర్ (రామ్ పోతినేని) ఏమో సూర్యకు డై హార్డ్ ఫ్యాన్. అతణ్ని పిచ్చిగా ఆరాధిస్తాడు.

సూర్య వందో సినిమా షూటింగ్ ఆగిపోయిందని తెలుసుకున్న సాగర్ తన ఫేవరెట్ హీరో కోసం రూ.3 కోట్లు పంపిస్తాడు. మరి సూర్య సినిమా షూటింగ్ ఎందుకు ఆగిపోయింది? రూ.3 కోట్లు సాగర్ ఎక్కడి నుంచి తెచ్చాడు? మధ్యలో మహాలక్ష్మి (భాగ్యశ్రీ) ఎవరు? అన్నది ఆంధ్రా కింగ్ తాలూకా చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More