ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. థియేటర్లో ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ దక్కినా, కలెక్షన్లు అంతంతమాత్రంగానే వచ్చాయి. కానీ ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్తోంది.
ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ

వరుసగా ఫ్లాప్ లు చూసిన రామ్ పోతినేని తన రూట్ మార్చాడు. కొత్త కథతో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అంటూ థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లో రిలీజైంది. కానీ కలెక్షన్లు మాత్రం గొప్పగా లేవు. ఇక డిసెంబర్ 25న ఓటీటీలోకి వచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
ట్రెండింగ్ నంబర్ వన్
ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో అదరగొడుతోంది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో చూసి మూవీపై ప్రశంసలు కురిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఇండియాలో ఆంధ్రా కింగ్ తాలూకా ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది.
పాజిటివ్ టాక్
మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వచ్చిన ఆంధ్రా కింగ్ తాలూకాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ రాంగ్ టైమింగ్ కారణంగా ఈ మూవీ వసూళ్లు దెబ్బతిన్నారు. 10 మందిలో 10 మంది మా సినిమా బాగుందని అంటున్నారు, కానీ ఆ 10 మంది మాత్రమే సినిమా చూస్తున్నారని కూడా రామ్ పోతినేని ఆవేదన వ్యక్తం చేశాడు. థియేట్రికల్ రన్ సమయంలో, ఈ చిత్రం మొత్తం రూ.23.49 కోట్ల నెట్ వసూలు చేసింది. భారతదేశంలో గ్రాస్ వసూళ్లు రూ.27.43 కోట్లుగా ఉన్నాయి.
ఆంధ్రా కింగ్ తాలూకా స్టోరీ
తన అభిమాన హీరో కోసం పెద్ద త్యాగం చేసే ఫ్యాన్ కథే ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ గా ఉపేంద్ర నటించాడు. ఫ్యాన్ సాగర్ గా రామ్ పోతినేని యాక్ట్ చేశాడు. సూర్య కుమార్ పెద్ద స్టార్ గా ఎదుగుతాడు. ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో సాగర్ ఒకరు. సూర్య తన 100వ సినిమాను ఘనంగా ప్రారంభిస్తాడు.
{{/usCountry}}తన అభిమాన హీరో కోసం పెద్ద త్యాగం చేసే ఫ్యాన్ కథే ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ గా ఉపేంద్ర నటించాడు. ఫ్యాన్ సాగర్ గా రామ్ పోతినేని యాక్ట్ చేశాడు. సూర్య కుమార్ పెద్ద స్టార్ గా ఎదుగుతాడు. ఆయనకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అందులో సాగర్ ఒకరు. సూర్య తన 100వ సినిమాను ఘనంగా ప్రారంభిస్తాడు.
{{/usCountry}}కానీ సూర్య వందో సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. ఆ సమయంలో సాగర్ రూ.3 కోట్లను తన హీరోకు పంపిస్తాడు. మరి ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందా? సాగర్ కు ఆ రూ.3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో చూడాల్సిందే.