విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ వినోద పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి అడుగులు పడనున్నాయి. సాగర నగరి విశాఖను సినిమాలు, డిజిటల్ కంటెంట్, గేమింగ్ సహా ఇతర క్రియేటివ్ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కలను సాకారం చేసేందుకు ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, రానా దగ్గుబాటి పాల్గొన్న లైవ్ పాడ్‌కాస్ట్ ఈ కీలక చర్చకు వేదికైంది.
మంత్రి లోకేశ్ తో కీలక చర్చ….

కేవలం సంప్రదాయ సినీ నిర్మాణానికి ఇచ్చే రాయితీలకే పరిమితం కాకుండా… విశాఖలో సమగ్రమైన ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. స్టూడియోలు, షూటింగ్ సదుపాయాలు, పోస్ట్-ప్రొడక్షన్ మౌలిక సదుపాయాలతో పాటు అనుబంధ క్రియేటివ్ వ్యాపారాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. గతంలో హైదరాబాద్‌లో స్టూడియోలు, ఫిల్మ్ నగర్ నిర్మాణంతో అది దేశంలోనే అతిపెద్ద సినీ నిర్మాణ కేంద్రంగా ఎదిగిన తీరును లోకేశ్ గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం, సినీ పరిశ్రమ భాగస్వామ్యంతో విశాఖలోనూ అదే నమూనాను విజయవంతంగా అమలు చేయవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నేటి కాలంలో ఆర్థిక వృద్ధికి 'క్రియేటర్ ఎకానమీ' ఒక కొత్త ఇంజిన్‌గా మారుతోందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. యూట్యూబ్ ప్రొడక్షన్స్, డిజిటల్ మీడియా, గేమింగ్ వంటి ఆధునిక రంగాల్లో అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్లు, అందుబాటులోకి వచ్చిన సాంకేతికత వల్ల యువ కంటెంట్ క్రియేటర్లకు అడ్డంకులు తొలగిపోయాయని, కంటెంట్ తయారీతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగాయని వివరించారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి, స్థానిక ప్రతిభను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు, సంస్థాగత మద్దతును అందిస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.
విశాఖలో సినీ నిర్మాణ కార్యకలాపాలు: రానా దగ్గుబాటి
మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు రానా దగ్గుబాటి సానుకూలంగా స్పందించారు. "రాబోయే ఏడాదిలో విశాఖపట్నంలో మా సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా కృషి చేస్తాను. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రానా తెలిపారు.
{{/usCountry}}మంత్రి లోకేశ్ ప్రతిపాదనకు రానా దగ్గుబాటి సానుకూలంగా స్పందించారు. "రాబోయే ఏడాదిలో విశాఖపట్నంలో మా సంస్థ తరఫున సినీ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా కృషి చేస్తాను. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. ఈ నగరానికి ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని రానా తెలిపారు.
{{/usCountry}}కేవలం సినిమాలకే కాకుండా డిజిటల్, ఇతర ఆధునిక ఫార్మాట్లలో పనిచేసే క్రియేటర్లకు అనుకూలమైన వాతావరణాన్ని విశాఖలో నిర్మించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక వైభవాన్ని రానా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. "ఏపీలో చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలతో పాటు ప్రపంచానికి ఇంకా పూర్తిగా పరిచయం కాని ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేలా ప్రచారం కల్పించాలి. ఆ దిశగా మా ప్రయత్నాలను కొనసాగిస్తాం" అని హీరో రానా చెప్పారు.