బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ తన రాబోయే యాక్షన్ మూవీ 'సుబేదార్' (Subedaar)తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మధ్యే జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనిల్ చెప్పిన ఓ విషయం నవ్వు తెప్పించేలా ఉంది. ఒక నటుడిగా తనకు బయట ఎంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, తన సొంత ఇంట్లో మాత్రం తన కుటుంబ సభ్యులు ఎవరూ తనకు ఫ్యాన్ కాదని అతడు నవ్వుతూ వెల్లడించాడు.
భార్య దగ్గర డబ్బులు తీసుకుంటా..

తన వృత్తిపరమైన విజయాల్లో తన భార్య సునీతా కపూర్ పాత్ర ఎంత కీలకమో అనిల్ కపూర్ ఎన్నోసార్లు బహిరంగంగా చెబుతుంటాడు. ఈ 'సుబేదార్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అతడు మాట్లాడుతూ.. తన భార్య తనను ఎంత సాధారణమైన వ్యక్తిగా ఉంచుతుందో సవివరంగా చెప్పాడు.
"నా ఇంట్లో నాకు ఎవరూ ఫ్యాన్స్ లేరు. ఈరోజు నేను ఈవెంట్ కోసం ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడు, ట్రైలర్ లాంచ్ కోసం వెళ్తున్నానని నా భార్యకు చెప్పాను. దానికి ఆమె 'ఏ సినిమా?' అని అడిగింది. నా వృత్తిపరమైన జీవితంలో ఏం జరుగుతుందో ఆమెకు అస్సలు తెలియదు. నేను అలాంటి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. వాళ్లు నన్ను అందరిలాగే చాలా సాధారణంగా చూస్తారు. కొన్నిసార్లు నేను షూటింగ్‌కు వెళ్లే ముందు ఖర్చుల కోసం రూ. 10,000 నుంచి 15,000 వరకు క్యాష్ నా భార్యను అడుగుతాను" అని అతడు చెప్పాడు.
ఈ సినిమాకు ఆమెనే స్ఫూర్తి
ఈ ఈవెంట్‌లో తన కెరీర్ కోసం తన భార్య ఎంతో త్యాగం చేసిందని కూడా అనిల్ కపూర్ వెల్లడించాడు.
"సుబేదార్ సినిమాలో నేను నా భార్యతో ఉన్న బంధాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. కచ్చితంగా నా కూతుళ్లతో నాకు అలాంటి బంధం లేదు. రియా, సోనమ్, నేను మంచి స్నేహితుల్లా ఉంటాము.. నా భార్య పట్ల నాకు ఉన్న ప్రేమ, నా పని పట్ల నాకు ఉన్న ప్రేమ.. అక్కడే నేను ఉంటాను. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నా పనిని కూడా ఎంతో ప్రేమిస్తాను. ఆ తర్వాత కచ్చితంగా నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తాను" అని అతడు ఎమోషనల్ అయ్యాడు.
సునీతా కపూర్, అనిల్ కపూర్ బంధం గురించి..
{{/usCountry}}"సుబేదార్ సినిమాలో నేను నా భార్యతో ఉన్న బంధాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. కచ్చితంగా నా కూతుళ్లతో నాకు అలాంటి బంధం లేదు. రియా, సోనమ్, నేను మంచి స్నేహితుల్లా ఉంటాము.. నా భార్య పట్ల నాకు ఉన్న ప్రేమ, నా పని పట్ల నాకు ఉన్న ప్రేమ.. అక్కడే నేను ఉంటాను. నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. నా పనిని కూడా ఎంతో ప్రేమిస్తాను. ఆ తర్వాత కచ్చితంగా నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తాను" అని అతడు ఎమోషనల్ అయ్యాడు.
సునీతా కపూర్, అనిల్ కపూర్ బంధం గురించి..
{{/usCountry}}వీరిద్దరి ప్రయాణం ఒక సరదా ప్రాంక్ కాల్ తో మొదలై.. జీవితకాల బంధంగా మారింది. అనిల్, సునీత మే 19, 1984న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెద్ద కుమార్తె సోనమ్.. రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'సావరియా' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వారి చిన్న కుమార్తె రియా కపూర్ ఒక సినిమా నిర్మాతగా రాణిస్తోంది. ఇక చిన్న కుమారుడు హర్షవర్ధన్ కపూర్ కూడా బాలీవుడ్ నటుడిగా కొనసాగుతున్నాడు.
'సుబేదార్' సినిమా విశేషాలు
సురేష్ త్రివేణి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో అనిల్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో రాధికా మదన్, సౌరభ్ శుక్లా, ఆదిత్య రావల్, మోనా సింగ్, ఫైసల్ మాలిక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా మార్చి 5న ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. తన జీవితంలో జరిగిన ఒక తీరని నష్టంతో బాధపడుతూ, తన కూతురికి దూరంగా ఉంటున్న రిటైర్డ్ సుబేదార్ అర్జున్ మౌర్య చుట్టూ తిరిగే కథ ఇది. ప్రశాంతమైన అతని జీవితం ఒక నిర్లక్ష్యపు పని వల్ల కుదుపునకు గురవుతుంది. అదేంటి? ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఈ మూవీ స్టోరీ.