...
...
Next Story

Pawan Kalyan Anna Konidela: అన్నా, పవన్ కళ్యాణ్ విడాకులను జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు.. ఆ వీడియోలు వైరల్ చేస్తూ!

Pawan Kalyan Anna Konidela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెజారిటీ అభిమానులు ఈ నిజాన్ని నమ్మడం లేదు. ఇది ఫేక్ అయితే బాగుండని పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలోనే అన్నా చెప్పులు పట్టుకున్న, గుండు గీసుకున్న వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు.

Published on: Nov 10, 2026, 06:17:31 IST
Advertisement

Pawan Kalyan Anna Konidela: ఏపీ రాజకీయాల్లో, టాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు ఒక ఊహించని వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) విడాకులు తీసుకుంటున్నట్లు వచ్చిన ప్రకటన సోషల్ మీడియాను అక్షరాలా షేక్ చేస్తోంది. ఇది ఫేక్ న్యూస్ అయితే బాగుండని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

వైరల్ అవుతున్న పాత వీడియోలు

చెప్పులు పట్టుకుంది-పేరు మార్చుకుంది-గుండు గీసుకుంది-ఇప్పుడు విడాకులు-అన్నా ఇన్‌స్టా డిలీట్!
చెప్పులు పట్టుకుంది-పేరు మార్చుకుంది-గుండు గీసుకుంది-ఇప్పుడు విడాకులు-అన్నా ఇన్‌స్టా డిలీట్!

ఈ విడాకుల వార్తల నేపథ్యంలో, అన్నా కొణిదెల గతంలో పవన్ కళ్యాణ్ పై చూపించిన ప్రేమకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ నేరుగా తన అన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి తల్లి, అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ భావోద్వేగ సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పులను అన్నా కొణిదెల తన చేతుల్లో పట్టుకున్న దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. భర్తపై ఆమెకు ఉన్న గౌరవానికి అది నిదర్శనంగా నిలిచింది.

పేరు మార్పు.. తిరుమలలో గుండు

ఇదంతా చూసి పవన్ పై అన్నాకు ఎంత ప్రేమో అని అభిమానులు అంతా అనుకున్నారు. ఈ జంట కలకాలం ఇలాగే అన్యోన్యంగా కలిసి ఉంటుందని ఫ్యాన్స్ మురిసిపోయారు.

మింగుడుపడని నిజం

ఇంతలా ప్రేమించుకున్న ఈ జంట మధ్య ఏమైందో, ఎలాంటి మనస్పర్థలు వచ్చాయో తెలియదు కానీ, సడెన్ గా వచ్చిన విడాకుల ప్రకటన అందరినీ షాక్ కు గురిచేసింది. భార్యాభర్తల మధ్య తప్పుఒప్పులను బయట వ్యక్తులం మనం జడ్జ్ చేయలేం. ఇది పూర్తిగా వారి పర్సనల్ డెసిషన్. కానీ, వారిని ఒక ఆదర్శ జంటగా చూసిన సోషల్ మీడియా అభిమానులు మాత్రం ఈ వియోగాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

అకౌంట్ డిలీట్..

ఇదిలా ఉంటే, ఈ విడాకుల ప్రకటన సమయంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నా కొణిదెల అకౌంట్ కనిపించడం లేదు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాను డిలీట్ చేసినట్లు లేదా డీయాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి, ఎవరికి వారు తమదైన శైలిలో విశ్లేషణలు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks