...
...
Next Story

యూట్యూబ్ వ్లాగర్స్ మిస్టరీ.. మరో ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్.. 8.3 ఐఎండీబీ రేటింగ్

అదిరిపోయే సస్పెన్స్ తో, ఉత్కంఠ రేపే మిస్టరీతో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతున్న కన్నడ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి ఇంకో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Nov 28, 2025, 18:44:47 IST
Advertisement

కన్నడ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ‘అంతిమ క్షణగళ్లు’ మరో ఓటీటీలోకి వచ్చేసింది. అదిరిపోయే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ కచ్చితంగా థ్రిల్ పంచే అవకాశముంది. ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ కు 8.3 ఐఎండీబీ రేటింగ్ ఉండటం విశేషం. ఈ మూవీ ఏంటీ? ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం.

అంతిమ క్షణగళ్లు ఓటీటీ

ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్ (imdb)
ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్ (imdb)

కన్నడ హారర్ మిస్టరీ థ్రిల్లర్ అంతిమ క్షణగళ్లు సినిమా ఇవాళ (నవంబర్ 28) మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ‘బిసినీఈటీ’ ఓటీటీలో శుక్రవారం రిలీజైంది. ఇది ‘బి సినీ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’కు చెందిన ఓటీటీ ప్లాట్ ఫామ్. ప్రాంతీయ భాషల్లో కంటెంట్ ను ఇది స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పుడు కన్నడ సినిమా అంతిమ క్షణగళ్లు సినిమా ఈ ఓటీటీలోకి వచ్చింది.

ఆ ఓటీటీలోనూ

కన్నడ సినిమా అంతిమ క్షణగళ్లు మూవీ ఇప్పటికే బుక్ మై షో స్ట్రీమ్ లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది 2022 హిట్ మూవీ ‘వళియే’ సినిమాకు కన్నడ రీమేక్. ఇది ఫస్ట్ ఫౌండ్ ఫూటేజీ మలయాళ మూవీ. అంటే సినిమాలో క్యారెక్టర్లు తాము రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్ ద్వారా స్టోరీని చూపిస్తాయి. అంతిమ క్షణగళ్లు అంటే అంతిమ క్షణాలు అని అర్థం.

అంతిమ క్షణగళ్లు సినిమాకు నిర్మల్ బేబీ వర్గీస్ డైరెక్టర్. ఇందులో బేబీ వర్గీస్, రోహిత్ వి.ఎస్, రజిత్ కుమార్, అస్వతి అనిల్, విష్ణు గోవిందన్ తదితరులు నటించారు.

అంతిమ క్షణగళ్లు స్టోరీ

ఆ రహస్య ప్రాంతానికి వెళ్లిన వాళ్లకు భయానకమైన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రాణాలు పోయే సంఘటనలు కళ్ల ముందే కనిపిస్తాయి. కెమెరాల్లో రికార్డ్ అయిన సీన్స్ పరంగానే అంతిమ క్షణగళ్లు మూవీ స్టోరీ ముందుకు సాగుతుంది. మరి చివరకు ఏం జరిగింది? ఆ మిస్టీరియస్ ప్లేస్ లో ఏముంది? రహస్యం ఏమిటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks