ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 21 కోట్ల తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్- దిగజారిన రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

ఓటీటీలోకి తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మాస్ జాతర స్ట్రీమింగ్‌కు ఇవాళ వచ్చేసింది. మాస్ మాహారాజా రవితేజ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల మరోసారి జంటగా నటించిన ఈ సినిమాకు రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహించారు. నాలుగు భాషల్లో ప్రీమియర్‌కు వచ్చిన మాస్ జాతర ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Nov 28, 2025, 06:26:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 28) తెలుగు యాక్షన్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే మాస్ జాతర. ధమాకా తర్వాత మాస్ మహారాజా రవితేజ, డ్యాన్సింగ్ క్వీన్ మరోసారి జంటగా నటించిన సినిమా ఇది. దాంతో మాస్ జాతరపై విపరీతమైన హైప్ పెరిగిన విషయం తెలిసిందే.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 21 కోట్ల తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్- దిగజారిన రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 21 కోట్ల తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్- దిగజారిన రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఎక్కడంటే?

డైరెక్టర్‌గా రైటర్

మాస్ జాతర సినిమాకు రచయిత భాను భోగవరపు దర్శకత్వం వహించారు. తెలుగులో అనేక సినిమాలకు రైటర్‌గా వర్క్ చేసిన భాను భోగవరపు ఈ సినిమాతోనే డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

హీరో నవీన్ చంద్ర విలన్‌గా

మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాస్ జాతరకు మ్యూజిక్ అందించాడు. మాస్ జాతర సినిమాలో హీరో నవీన్ చంద్ర విలన్‌గా నటించగా.. రాజేంద్రప్రసాద్, నరేష్, సముద్రఖని, వీటీవీ గణేష్, హైపర్ ఆది, అజయ్ ఘోష్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

రవితేజ కామెడీ టైమింగ్ అదుర్స్

అక్టోబర్ 31న థియేటర్లలో మాస్ జాతర సినిమా విడుదలైంది. అయితే, ఈ సినిమాకు హైప్ వచ్చినంత స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. రొటీన్ స్టోరీ, టేకింగ్ కూడా పెద్దగా బాగాలేదంటూ మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ, రవితేజ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని, కామెడీ డైలాగ్స్ బాగా నవ్వించేలా ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి.

దిగజారిన రేటింగ్

రవితేజ యాక్షన్ సీక్వెన్స్, నవీన్ చంద్ర విలనిజం ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు. ఇలా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న మాస్ జాతర ఐఎమ్‌డీబీలో పదికి 4.9 రేటింగ్ మాత్రమే సంపాదించుకుంది. అయితే, థియేట్రికల్ రిలీజ్ తర్వాత మాస్ జాతరకు ఐఎమ్‌డీబీలో 5.1 రేటింగ్ ఉండేది. కానీ, ఇప్పుడు అది 4.9కి దిగజారిపోయింది.

మాస్ జాతర ఓటీటీ

అలాగే, మాస్ జాతర సినిమాకు రూ. 9 కోట్ల బడ్జెట్ కాగా బాక్సాఫీస్ వద్ద రూ. 21.65 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఇవాళ మాస్ జాతర ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి మాస్ జాతర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, నెలకు 3 రోజుల సమయం ఉండగానే మాస్ జాతర ఓటీటీ ప్రీమియర్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం వంటి నాలుగు భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో మాస్ జాతర ఓటీటీ రిలీజ్ అయింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వాళ్లు నేటి (నవంబర్ 28) నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మాస్ జాతర మూవీని ఎంచక్కా వీక్షించవచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More