...
...
Next Story

Anupama Bhogi: పక్కా పల్లెటూరి అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్.. శర్వానంద్ భోగి నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్.. పేరు ఇదే

Anupama Bhogi: వరుస సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న మరో చిత్రం ‘భోగి’. ఇందులో శర్వానంద్ హీరో. ఈ మూవీ నుంచి అనుపమ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Published on: Apr 30, 2026, 11:36:16 IST
Advertisement

Anupama Bhogi: విభిన్న కథలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్ మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో రాబోతుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘భోగి’ మూవీలో అనుపమ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది వైరల్ గా మారింది.

అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్

భోగి సినిమా నుంచి అనుపమ ఫస్ట్ లుక్ (instagram-Anupama Parameswaran)
భోగి సినిమా నుంచి అనుపమ ఫస్ట్ లుక్ (instagram-Anupama Parameswaran)

శర్వానంద్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘భోగి’ తెరకెక్కుతోంది. ఇందులో ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ ను గురువారం (ఏప్రిల్ 30) మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా అనుపమ కనిపించింది. తలపై బుట్టలో టేకు చెట్టు ఆకుల కట్టలతో, భుజానికి కూడా ఆకులు వేలాడేసుకుని ఆమె వెళ్తున్నట్లు ఉంది. మరో చేతిలో క్యారేజీ కూడా ఉంది.

పేరు ఇదే

భోగి నుంచి అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ లుక్ తో పాటు ఆమె క్యారెక్టర్ పేరును కూడా మేకర్స్ రివీల్ చేశారు. కందుల సులోచన రాణి అనే పాత్రను అనుపమ పోషిస్తోంది.

‘‘వరల్డ్.. కందుల సులోచన రాణిని కలవండి. ప్ర‌కృతి బిడ్డ.. గంగా ఇల్లు.. కందుల గౌరవం.. భోగి ఆత్మ’’ అనే క్యాప్షన్ తో తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను అనుపమ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

భోగి గురించి

అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు చాలా బిజీ. తెలుగు, మలయాళం, తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. 2025లో ఆమె హీరోయిన్ గా చేసిన ఆరు చిత్రాలు రిలీజ్ కావడం విశేషం. డ్రాగన్, జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా, కిష్కింధపురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ సినిమాలతో గతేడాది అనుపమ అదరగొట్టింది. ఈ ఏడాది ఇప్పటికే లాక్ డౌన్ మూవీతో ఆడియన్స్ ను పలకరించింది.

జోష్ లో

మరోవైపు శర్వానంద్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 2026లో ఇప్పటికే అతని రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్ అందుకున్న శర్వా.. తాజాగా ‘బైకర్’ సినిమాతో మరోసారి అదరగొట్టాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe