Anupama Parameswaran: గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అత్యంత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్న తాను ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేధింపుల (నార్సిసిస్టిక్ అబ్యూస్) గురించి ఆమె బహిరంగంగా మాట్లాడారు.
అనుపమ పరమేశ్వరన్ కామెంట్లు

ధ్యాన్ వర్మ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ తన మాజీ ప్రియుడి ప్రవర్తనను వివరిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. "నేను నటినైనందుకు, ధైర్యంగా నా భావాలను చెప్పగలిగినందుకు, ఆఖరికి నాకు పీరియడ్స్ వస్తున్నాయనే నిజానికి కూడా తీవ్రంగా సిగ్గుపడే పరిస్థితికి ఆ వ్యక్తి నన్ను నెట్టేశాడు.
సైకిల్‌లో మొదటి రోజు, ఐదో రోజు, పది, పదిహేను, ఇరవై లేదా ఇరవై ఐదో రోజు.. ఇలా ఏ రోజునైనా అతడు చేసిన తప్పును నిలదీస్తే చాలు, 'నీకు పిఎమ్ఎస్ (PMS) మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, పీరియడ్స్ వచ్చే సమయం కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నావ్' అని నాపైకే నెట్టేసేవాడు’’ అని సంచలన విషయాలను అనుపమ బయటపెట్టారు.
11 మంది పిల్లలు కావాలని
పిల్లల విషయంలోనూ అనుపమ పరమేశ్వరన్ తన ఆలోచనలను వెల్లడించారు. ‘‘ఒకప్పుడు నాకు 11 మంది పిల్లలు కావాలని ఆశపడ్డాను. కానీ, ఆ చేదు అనుభవం తర్వాత అసలు పిల్లలే వద్దనుకునే స్థాయికి చేరుకున్నాను. ఒక మహిళగా పుట్టినందుకు, నేను సాధించిన విజయాలను చూసి నాకే చాలా బాధ అనిపించింది" అని అనుపమ ఎమోషన్ అయ్యారు.
అన్నింటిపై కంట్రోల్
రెండేళ్ల పాటు సాగిన ఆ బంధంలో ఆ వ్యక్తి తనను పూర్తిగా తన కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నించాడని అనుపమ తెలిపారు. తన దుస్తుల ఎంపిక నుంచి తాను చేసే సినిమాల వరకు ప్రతిదాన్నీ ఆ వ్యక్తి మార్చేశాడని చెప్పారు. అతని తీవ్రమైన ఒత్తిడి వల్లే తాను 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేదని, అలాగే 'పరదా' సినిమా ప్రమోషన్ల సమయంలో తనపై అసభ్యకరమైన కామెంట్లు రావడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించారు.
{{/usCountry}}రెండేళ్ల పాటు సాగిన ఆ బంధంలో ఆ వ్యక్తి తనను పూర్తిగా తన కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నించాడని అనుపమ తెలిపారు. తన దుస్తుల ఎంపిక నుంచి తాను చేసే సినిమాల వరకు ప్రతిదాన్నీ ఆ వ్యక్తి మార్చేశాడని చెప్పారు. అతని తీవ్రమైన ఒత్తిడి వల్లే తాను 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేదని, అలాగే 'పరదా' సినిమా ప్రమోషన్ల సమయంలో తనపై అసభ్యకరమైన కామెంట్లు రావడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నానని వెల్లడించారు.
{{/usCountry}}ఆ వ్యక్తి తనను నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని నిరంతరం ఒత్తిడి తెచ్చాడని అనుపమ చెప్పారు. అయితే తన అంతరాత్మ చెప్పిన హెచ్చరికల వల్లే ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చానని అనుపమ తెలిపారు.
ధృవ్ విక్రమ్‌తో డేటింగ్ రూమర్లు
కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్న అనుపమ.. గతేడాది జూలైలో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆ వ్యక్తి పేరును నేరుగా చెప్పకుండా అతని విపరీతమైన ప్రవర్తనను నెట్టింట బయటపెడుతున్నారు. అతడి వైఖరిని ప్రముఖ తమిళ చిత్రం 'అపరిచితుడు' (అన్నియన్) లోని విక్రమ్ పాత్రతో పోల్చడం గమనార్హం.
మరి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'బైసన్ కాళమాడన్' చిత్రంలో ధృవ్ విక్రమ్‌తో కలిసి నటించిన అనుపమ, 2025 ఆరంభం నుంచి ఆయనతో డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో, ఒకే స్పోటిఫై ప్లేలిస్ట్ పంచుకోవడం, వివిధ అవార్డు వేడుకల్లో వారి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ఈ రూమర్లకు బలం చేకూర్చాయి.