...
...
Next Story

Anushka Shetty: ఏడాదికి 6 సినిమాలు.. ఇప్పుడు 8 ఏళ్లలో కేవలం 4.. అనుష్క శెట్టి కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికి కారణాలివేనా?

Anushka Shetty: టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. తన కెరీర్ లో పీక్ స్టేజ్ ను చూసిన ఈ భామ.. ఇప్పుడు చేతిలో సినిమాలు లేక ప్రేక్షకులకు దూరంగానే ఉంది. ఒకప్పుడు ఏడాది 6 మూవీస్ చేసిన అనుష్క.. ఇప్పుడు 8 ఏళ్లలో నాలుగు సినిమాలు మాత్రమే చేసింది.

Published on: May 14, 2026 09:19 AM IST
Advertisement

Anushka Shetty: ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. లేడీ ఓరియంటెడ్ బ్లాక్ బస్టర్లు.. అనుష్క శెట్టి అనగానే సినీ లవర్స్ కు ఇవే గుర్తుకొస్తాయి. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆమె. ఏడాదికి 6 సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ స్లో అయిపోయింది. 8 ఏళ్లలో నాలుగే చిత్రాల్లో నటించింది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

అనుష్క శెట్టి సినిమాలు

అనుష్క శెట్టి (x/anushka shetty)
అనుష్క శెట్టి (x/anushka shetty)

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు.. పీక్స్ లో ఉండగానే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసేయ్యాలి. ఆ తర్వాత ఛాన్స్ లు రావు. ఇప్పుడు అనుష్క శెట్టి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. 2005లో సూపర్ మూవీతో డెబ్యూ చేసిన ఈ భామ ఈ 20 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

అప్పుడు ఆరు సినిమాలు

అనుష్క శెట్టి ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగింది. 2008లో ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క మగాడు, స్వాగతం, బలాదూర్, శౌర్యం, చింతకాయల రవి మూవీస్ రిలీజ్ అయ్యాయి. 2010లో అయితే ఏకంగా 6 చిత్రాలు థియేటర్లకు వచ్చాయి. సింగం, వేదం, పంచాక్షరి, ఖలేజా, నాగవల్లి, రగడ సినిమాలతో ఆమె సందడి చేసింది.

బ్లాక్ బస్టర్లు

తెలుగు, తమిళంలో ఓ దశలో తిరుగులేని హీరోయిన్ గా అనుష్క శెట్టి దూసుకెళ్లింది. ముఖ్యంగా అరుంధతితో ట్రెండ్ సెట్ చేసింది. సింగం ఫ్రాంఛైజీ సినిమాలతో తెలుగుతో పాటు తమిళంలో ఊపు ఊపింది. ఇక బాహుబలి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది స్వీటీ. కానీ ఆ తర్వాత ఆమె కెరీర్ స్లో అయిపోయింది.

8 ఏళ్లలో

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సాగిపోయిన అనుష్క శెట్టి కెరీర్ ఇప్పుడు ఇలా మారడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా సైజ్ జీరో మూవీ కోసం విపరీతంగా బరువు పెరగడం చేటు చేసింది. ఈ ప్రయోగం స్వీటీ కెరీర్ నే ప్రమాదంలో నెట్టేసింది. మళ్లీ ఆమె బరువు తగ్గింది. కానీ అంతకుముందు ఉన్నట్లుగా తన శరీరాన్ని మార్చుకోలేకపోయింది.

బరువు పెరగడంతో స్వీటీకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు ఆమె ఏజ్ కూడా ఒక కారణం. 44 ఏళ్ల వయసులో హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు రావడం అరుదే. ఇక పెళ్లి రూమర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అనుష్క శెట్టి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటుందని అంటున్నారు.

ఇక అనుష్క సినిమాలు కూడా మునుపటిలా ఆడటం లేదు. ఘాటి మూవీ మీద ఆమె భారీ ఆశలే పెట్టుకుంది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో అనుష్క కెరీర్ మళ్లీ పుంజుకోవడం కష్టమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe