...
...
Next Story

AP Govt Nandi Awards : త్వరలోనే నంది అవార్డుల ప్రదానం - వేదిక, తేదీలపై ఏపీ సర్కార్ కసరత్తు

సంస్కృతి ప్రతిబింబించేలా ‘నంది నాటకోత్సవాలు’ నిర్వహిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. త్వరలోనే నంది అవార్డులను అందజేస్తామని ప్రకటించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు.

Published on: Feb 28, 2026, 11:22:29 IST
Advertisement

రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ ని ప్రోత్సహించేలా అధికారులు పని చేయాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. పర్యాటక, చలనచిత్ర అభివృద్ధి సంస్థ, డిజిటల్ కార్పొరేషన్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఎఫ్.డి.సి  అధికారులతో మంత్రి సమీక్ష
ఎఫ్.డి.సి అధికారులతో మంత్రి సమీక్ష

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఎఫ్.డి.సి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ మరియు అధికారులతో మంత్రి కందుల దుర్గేష్ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు.

త్వరలోనే అవార్డులు…

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రతిష్టను చాటి చెప్పే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, టీవీ, థియేటర్ అవార్డులను త్వరలోనే ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి జ్యూరీ ఏర్పాటు, వేదికలు, తేదీలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లను ప్రోత్సహించేలా నూతన ఫిల్మ్ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో షూటింగ్ జరుపుకునే చిత్రాలలో ఆయా పర్యాటక ప్రాంతాల పేర్లను తెరపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ స్టూడియోల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక డేటా బ్యాంక్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటు విషయమై ఇప్పటికే పలు దఫాలు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించగా వారు సానుకూలంగా స్పందించారని మంత్రి దుర్గేష్ అధికారులకు వెల్లడించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks