...
...
Next Story

OTT Thriller: నా కో స్టార్ దానికి బానిసను చేశారు, ఆ 40 రోజుల అనుభవం అద్భుతం: ఓటీటీ హీరోయిన్ అపర్ణ దీక్షిత్ కామెంట్స్

Aparna Dixit About OTT Thriller Series Hotspot: ఓటీటీ హీరోయిన్ అపర్ణ దీక్షిత్ లక్నో వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. తన కొత్త ఓటీటీ వెబ్ సిరీస్ 'హాట్‌స్పాట్' షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన ఈ భామ, పనిని విహారయాత్రలా మార్చుకుంటూ నగరంలోని రుచులను ఆస్వాదిస్తున్నారు. ఆ విషయాలను తాజాగా పంచుకుంది ఈ బ్యూటీ.

Published on: Apr 30, 2026 09:29 PM IST
Advertisement

Aparna Dixit About OTT Thriller Series Hotspot: రాజీవ్ మెండిరట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ సిరీస్ హాట్‌స్పాట్ షూటింగ్ కోసం ఓటీటీ బ్యూటిపుల్ హీరోయిన్ అపర్ణ దీక్షిత్ ఇటీవల లక్నోలో 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ 40 రోజుల అనుభవం తన కెరీర్‌లోనే అత్యంత అద్భుతమైనదని ఆమె చెబుతున్నారు.

మనసు నిండిపోతుంది

నా కో స్టార్ దానికి బానిసను చేశారు, ఆ 40 రోజుల అనుభవం అద్భుతం: ఓటీటీ హీరోయిన్ అపర్ణ దీక్షిత్ కామెంట్స్
నా కో స్టార్ దానికి బానిసను చేశారు, ఆ 40 రోజుల అనుభవం అద్భుతం: ఓటీటీ హీరోయిన్ అపర్ణ దీక్షిత్ కామెంట్స్

"ఇది నాకు వర్క్ కమ్ వెకేషన్ ట్రిప్‌లా అనిపించింది. నా సొంత ఊరు ఆగ్రాకు దగ్గరగా ఉండటం, నా ప్రాణ స్నేహితురాలు ఇక్కడే ఉండటంతో లక్నో నాకు ఎప్పుడూ ప్రత్యేకం. ఇప్పటికే ఇక్కడ మూడు ప్రాజెక్టులు చేశాను. ఇక్కడికి వస్తే మనసు నిండిపోతుంది" అని అపర్ణ దీక్షిత్ మురిసిపోతూ చెప్పుకొచ్చారు.

శాఖాహార రుచులకు ఫిదా.. లక్నో చాట్!

గతంలో అపర్ణ దీక్షిత్ 'ఎగ్జిట్' (2022), 'సబ్సే బడా రూపాయి' (2024) వంటి ఓటీటీ సిరీస్‌లతో మెప్పించారు. లక్నో అంటే వెంటనే గుర్తుకువచ్చేది నాన్-వెజ్ వంటకాలు. కానీ, పక్కా వెజిటేరియన్ అయిన అపర్ణకు ఈ నగరం కొత్త రుచులను పరిచయం చేసిందట. గోమతీ నగర్ ప్రాంతంలో 15 రోజులకు పైగా బస చేసిన అపర్ణ షూటింగ్ ప్యాకప్ అవ్వగానే షూస్ వేసుకుని అక్కడి కెఫేలను అన్వేషించేవారట.

"గోమతీ రివర్ ఫ్రంట్ వద్ద ఉన్న ఫుడ్ వ్యాలీకి ఐదుసార్లు వెళ్లాను. అక్కడ దొరికే వెరైటీ ఫుడ్ నన్ను ఆశ్చర్యపరిచింది. లక్నోలో కేవలం మాంసాహారమే కాదు, వెజిటేరియన్లకు కూడా బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయి. చాట్, పకోడీ, కచోరీ.. ఇలా దేన్నీ వదలకుండా టేస్ట్ చేశాను. నా కో-స్టార్ సంజయ్ గంగానీ నన్ను చాట్‌కు బానిసను చేసేశారు. ఇప్పుడు దాన్ని చాలా మిస్ అవుతున్నాను" అని అపర్ణ తన ఫుడ్ ముచ్చట్లను పంచుకున్నారు.

ఫ్యామిలీ వెడ్డింగ్.. స్పిరిచువల్ టూర్

అదే సమయంలో హనుమాన్ సేతు, చంద్రికా దేవి వంటి ప్రముఖ ఆలయాలను సందర్శించి ఆధ్యాత్మికతను చాటుకున్నారు. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా కేవలం నాలుగు గంటల్లోనే తన సొంత ఊరు ఆగ్రాకు రోడ్ ట్రిప్ వెళ్లడం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని అపర్ణ దీక్షిత్ పేర్కొన్నారు.

సినిమాలపై ఆసక్తి ఉంది కానీ..

టెలివిజన్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై బిజీగా ఉన్న అపర్ణ వెండితెర సినిమాల్లోకి రావడంపై కూడా స్పందించారు. "నేను ఇంకా వెండితెరపై అడుగుపెట్టలేదు, అలాగని తొందర ఏమీ లేదు. మంచి కథలు వస్తే కచ్చితంగా చేస్తాను. ఇప్పటివరకు మనసుకు నచ్చిన స్క్రిప్ట్ రాలేదు. మాధ్యమం ఏదైనా సరే, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడమే నా లక్ష్యం" అని అపర్ణ దీక్షిత్ స్పష్టం చేశారు.

ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్?

ఇదిలా ఉంటే, ఓటీటీలోకి సరికొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ హాట్‌స్పాట్ రానుందని తెలుస్తోంది. అయితే, హాట్‌స్పాట్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

గోమతి నగర్‌లో లక్నవీ చాట్ ఎంజాయ్ చేస్తున్న అపర్ణ దీక్షిత్
లక్నోలోని స్కార్పియో క్లబ్‌లో అపర్ణ దీక్షిత్

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అపర్ణ దీక్షిత్ నటించిన కొత్త వెబ్ సిరీస్ పేరు ఏమిటి?

ఆమె రాజీవ్ మెండిరట్టా దర్శకత్వంలో 'హాట్‌స్పాట్' అనే ఓటీటీ థ్రిల్లర్ సిరీస్‌లో నటిస్తున్నారు.

2. అపర్ణ దీక్షిత్ లక్నోలో ఏయే ప్రాంతాలను సందర్శించారు?

ఆమె గోమతీ నగర్, గోమతీ రివర్ ఫ్రంట్ (ఫుడ్ వ్యాలీ), హనుమాన్ సేతు ఆలయం, చంద్రికా దేవి ఆలయాలను సందర్శించారు.

3. అపర్ణ గతంలో నటించిన ప్రాజెక్టులు ఏమిటి?

ఆమె 'తులసి కుమారి బడి సియానీ' (2025) టీవీ సిరీస్‌తో పాటు 'ఎగ్జిట్' (2022), 'సబ్సే బడా రూపాయి' (2024) వంటి ఓటీటీ సిరీస్‌లలో నటించారు.

4. సినిమాల్లో నటించడం గురించి అపర్ణ ఏమన్నారు?

సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే బలమైన కథాంశం ఉన్న పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe