ధనుష్, మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారారు. ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీళ్ల రిలేషన్ షిప్ ను సీక్రెట్ గా ఉంచారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. దీనికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన ఓ పనే కారణం.
వారణాసి ఫొటోలు

ధనుష్ ఇటీవల వారణాసి సందర్శించినప్పటి ఫోటోల సిరీస్‌ను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించిన 'రాంఝానా' చిత్రంలో తన కుందన్ పాత్ర ప్రయాణం ఎక్కడ మొదలైందో అక్కడే ఈ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. దశాబ్దానికి పైగా తనను వదలని కుందన్ పాత్ర పేరు ఇప్పటికీ బనారస్ వీధుల్లో ప్రతిధ్వనిస్తుందని, ప్రజలు పిలిచినప్పుడు తను తిరిగి నవ్వుతూ వెళ్తానని ధనుష్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు. దీనికి మృణాల్ ఠాకూర్ కామెంట్ వైరల్ గా మారింది.
ధనుష్ పోస్ట్
వారణాసి నుంచి పలు ఫోటోలను ధనుష్ షేర్ చేశారు. వాటిలో ‘తేరే ఇష్క్ మే’, 'రాంఝానా' దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కూడా ఉన్నారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ధనుష్.. 'ప్రారంభమైన చోట జ్ఞాపకాల దారిలో ఒక నడక. కుందన్.. పదేళ్ల తర్వాత కూడా నన్ను వదిలి వెళ్లని పాత్ర. ఆ పేరు ఇప్పటికీ బనారస్ వీధుల్లో ప్రతిధ్వనిస్తుంది. ప్రజలు నన్ను అలాగే పిలుస్తారు, నేను తిరిగి నవ్వి వెళ్తాను.
ఇప్పుడు అదే దారుల్లో నడుస్తూ, అదే ఇంటి ముందు కూర్చుని, అదే టీ కొట్టులో టీ తాగుతూ, పవిత్ర గంగా తీరంలో నాతో కుందన్ను పరిచయం చేసిన వ్యక్తితో నడవడం ఒక పూర్తి సైకిల్ లా అనిపిస్తుంది. ఇప్పుడు శంకర్ వంతు’’ అని ధనుష్ పేర్కొన్నాడు.
మృణాల్ కామెంట్
{{/usCountry}}ఇప్పుడు అదే దారుల్లో నడుస్తూ, అదే ఇంటి ముందు కూర్చుని, అదే టీ కొట్టులో టీ తాగుతూ, పవిత్ర గంగా తీరంలో నాతో కుందన్ను పరిచయం చేసిన వ్యక్తితో నడవడం ఒక పూర్తి సైకిల్ లా అనిపిస్తుంది. ఇప్పుడు శంకర్ వంతు’’ అని ధనుష్ పేర్కొన్నాడు.
మృణాల్ కామెంట్
{{/usCountry}}ధనుష్ పోస్ట్ కు మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్ వైరల్ గా మారింది. ‘‘ధనుష్ రాజా సార్, ఎంత అందమైన ప్రయాణం! బ్లాక్‌బస్టర్!! కల్ట్!!! లెగసీ!!’’ అని హై-ఫై ఎమోజీతో అభినందించారు. ధనుష్ కూడా తిరిగి హగ్, తెల్లటి హృదయంతో స్పందించారు. దీంతో మరోసారి ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లయింది.
ఆ ప్రీమియర్ లో కలిసి
ఆగస్టులో మృణాల్ ఠాకూర్ నటించిన చిత్రం 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో ధనుష్, మృణాల్ కలిసి కనిపించడం వైరల్ గా మారింది. అంతకుముందే 'తేరే ఇష్క్ మే' ర్యాప్ పార్టీలో ఆమె ఉండటం అప్పటికే ఊహాగానాలకు దారితీసింది. ఆమె ధనుష్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం కూడా ఈ చర్చలకు మరింత బలాన్నిచ్చింది.
తేరే ఇష్క్ మే గురించి
గుల్షన్ కుమార్, టీ-సిరీస్, కలర్ యెల్లో ప్రెజెంట్ చేసే 'తేరే ఇష్క్ మే' చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్, హిమాంశు శర్మ, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్ నిర్మాతలు. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ధనుష్, కృతి సనన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈరోజు, 28 నవంబర్ 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.